తెలంగాణ

telangana

తత్కాల్ టికెట్ బుక్ అవ్వడం లేదా? - ఇలా చేశారంటే మీ టికెట్ ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది! - IRCTC Tatkal Ticket

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 11:06 AM IST

Tatkal Ticket Confirm Tips : ట్రైన్ టికెట్లు ముందస్తుగా దొరకనివారిలో చాలా మంది తత్కాల్ వైపు చూస్తారు. కానీ, అవి బుక్ అవ్వడం కూడా అంత సులభం కాదని భావిస్తారు. అయితే.. ఇలా బుక్ చేసి చూడండి.. మీ తత్కాల్ టికెట్ ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది! అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Tatkal Ticket
Tatkal Ticket Confirm Tips

How to Book Confirm Tatkal Ticket :సమయం ఆదా, తక్కువ ఖర్చు వంటి కారణాలతో రైలు ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. సుదూర ప్రాంతాలకు ట్రైన్​ జర్నీ ప్లాన్ చేసేవారు ముందస్తుగా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేస్కుంటారు. కానీ.. కొన్నిసార్లు ఉన్నట్టుండి జర్నీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ముందస్తుగా రిజర్వేషన్​ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారంతా తత్కాల్​లో టికెట్ బుక్ చేసుకునేందుకు చూస్తారు.

వీరికోసం ఐఆర్​సీటీసీలో(IRCTC)తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఐఆర్​సీటీసీ అందిస్తున్న తత్కాల్ టికెట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవడానికి వీలు లేదు. ప్రయాణం చేయడానికి ఒక రోజు ముందు మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఏసీ క్లాస్​లకు సంబంధించిన టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే.. నాన్ ఏసీ క్లాస్​లకు చెందిన టికెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

అంత ఈజీకాదు..

కానీ.. తత్కాల్ టికెట్లు పొందడం అంత సులభమైన పనికాదు. ఎందుకంటే.. ఆ టైమ్​లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి చాలా మంది ఒకేసారి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. తత్కాల్ టికెట్ విండో కొంత సమయం మాత్రమే ఓపెన్​లో ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మంది ఒకేసారి బుకింగ్​కి ప్రయత్నించడం వల్ల ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి.. మీరు తత్కాల్ బుకింగ్ టైమ్​లో వేగంగా, చురుకుగా స్పందించాల్సి ఉంటుంది. అయితే.. ఆ టైమ్​లో ఇలా బుక్ చేసుకున్నారంటే ఈజీగా తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

విహార యాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - Summer Special Trains

తత్కాల్ టికెట్ ఎలా కన్ఫామ్ చేసుకోవాలి?

  • IRCTCలో మీరు తత్కాల్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ముందుగా IRCTC అకౌంట్​ను కలిగి ఉండాలి.
  • లేదంటే IRCTC వెబ్‌సైట్‌, యాప్‌ను సందర్శించి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ అకౌంట్​తో లాగిన్ అవ్వాలి. అనంతరం ఓపెన్ అయిన పేజీలో 'My Account' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మాస్టర్ జాబితా అనే ఆప్షన్​ను ఎంచుకొని అక్కడ అవసరమైన డేటాను ఎంటర్ చేయాలి.
  • ఆ విధంగా మీరు ప్రయాణీకుల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత.. ఆ సమాచారం కరెక్టా కాదా? అని మళ్లీ కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు తత్కాల్ టికెట్ విండో ఓపెన్ చేసి మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను అందించాలి.
  • దీని తర్వాత మాస్టర్ జాబితాలో మీరు అంతకుముందు నమోదు చేసిన సమాచారం కనిపిస్తుంది.
  • ఇలా సమాచారం మొత్తం ముందే సిద్ధం చేసి, సేవ్ చేసుకోవడం ద్వారా.. మీకు టికెట్ అవసరమైనప్పుడు.. మళ్లీ మొదట్నుంచి డీటెయిల్స్ ఇవ్వాల్సిన పనిలేదు. దాంతో మీకు సమయం ఆదా అవుతుంది.
  • ఇప్పుడు మీరు పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. వెంటనే మీ తత్కాల్ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - జనరల్​ టికెట్ కోసం స్టేషన్​కు వెళ్లాల్సిన అవసరం లేకుండా - ఇంటి నుంచే ఈజీగా!

ABOUT THE AUTHOR

...view details