తెలంగాణ

telangana

అయోధ్యకు పొటెత్తిన భక్తులు- దర్శనం కోసం భారీ క్యూ

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 9:56 AM IST

Updated : Jan 23, 2024, 10:42 AM IST

Ayodhya Ram Temple Crowd : మంగళవారం నుంచి సామాన్య భక్తులకు కూడా దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Ayodhya Ram Temple Crowd
Ayodhya Ram Temple Crowd

Ayodhya Ram Temple Crowd: అయోధ్యలో మంగళవారం నుంచి సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 7 నుంచి ఆలయంలోకి అనుమతించించారు. అయోధ్య బాలరాముడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలమంది భక్తులు బారులు తీరారు. దీంతో దర్శన వేళలు పొడిగించే యోచనలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఉన్నట్లు సమాచారం. అయోధ్య ఆలయ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేేశారు.

మంగళవారం ఉదయం ఏడు గంటల ముందే రాముడికి హారతి ఇచ్చారు. అనంతరం భక్తులు దర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఉదయం హారతి కార్యక్రమానికి పరిమితంగా ఉచిత పాస్​లు అందించారు. మరోవైపు, ఆలయానికి వెళ్లే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

దర్శన, హారతి వేళలు
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దర్శనం, హారతి వేళల వివరాలను వెబ్​సైట్​లో వెల్లడించింది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. హారతి వేళలను ఉదయం 6:30 గంటలకు అని పేర్కొన్నారు. అయితే ఈ దర్శనం కోసం ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సంధ్యా హారతి రాత్రి 7:30 గంటలకు ఉంటుంది.

దర్శనం/హారతి పాస్​లకు అన్​లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
మొదట శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లి రిజిస్ట్రేష్టన్​ చేసుకోవాలి. అందుకోసం మీ మొబైల్​ నంబరుతో సైన్​ ఇన్​ అయి ఓటీపీ ఎంటర్​ చేస్తే చాలు రిజిస్ట్రేష్టన్​ పూర్తవుతుంది. తరువాత లాగిన్​ అయి మై ప్రొఫైల్ సెక్షన్​లోకి వెళ్లి మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటి నమోదు చేయాలి. ఆ తర్వాత హారతి లేదా దర్శనం టైమ్​ స్లాట్లను ఎంచుకుని పాస్​ కోసం బుక్​ చేసుకోవాలి. ఆలయంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్​లో మీ పాస్​లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

Last Updated : Jan 23, 2024, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details