Prathidwani: ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. మనవాళ్లు ఇకనైనా మేల్కొంటారా?

By

Published : Apr 4, 2022, 10:06 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

Prathidwani: దినదిన గండం. నిన్నటి వరకు ఏమో గానీ.. నేడు అతికినట్లు సరిపోతుంది శ్రీలంక పరిస్థితికి ఈ మాట. రోజురోజుకీ చిక్కబడుతున్న సంక్షోభం వారికి దిక్కుతోచకుండా చేస్తోంది. అప్పుల కుప్పలు, అసమర్థ పాలన, అనుచిత పథకాలు, రాజకీయ అస్థిరత.. అన్నీ వెరసి ఇప్పుడు ఆ దేశాన్ని పెనుగండం ముందు నిలిపాయి. దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో.. మొత్తం వ్యవస్థలు ఎప్పుడు కుప్పకూలుతాయోనని.. అంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. వెనెజులా నుంచి ప్రపంచం ఏ పాఠం నేర్చుకుందో తెలియదు కానీ.. శ్రీలంక నుంచి మాత్రం ప్రతి దేశం, మనదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పాఠం నేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.