Video Viral : ప్రమాదకరమైనరీతిలో బైక్స్​ స్టంట్స్​.. సోషల్ మీడియాలో వైరల్

By

Published : Jul 11, 2023, 4:30 PM IST

thumbnail

Dangerous Bike Stunts In Hyderabad : ఈ మధ్య యువత సోషల్​ మీడియాలో ఫేమస్​ అవ్వాలని చెప్పి.. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రమాదకరమైన విన్యాసాలను చేస్తున్నారు. హైదరాబాద్​లోని సైబరాబాద్​లో పలు ప్రాంతాల్లో బైకులపై కొందరు ఆకతాయిలు విన్యాసాల పేరుతో హల్​చల్​ సృష్టించారు. అమ్మాయిలతో కలిసి ఆందోళనకరమైన రీతిలో యువకులు బైక్​ స్టంట్స్​ చేస్తున్నారు. వెనుక కూర్చున్న యువతి.. కనీసం భయం లేకుండా ఎంజాయ్​ చేస్తూ కేరింతలు కొడుతూ కనిపిస్తోంది. 

ఈ విధమైన విన్యాసాలు ప్రధానంగా మాదాపూర్​, గచ్చిబౌలి, తీగల వంతెనపై ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేస్తున్నారు. ఒక కార్యక్రమంలో విన్యాసాలను చేస్తున్నా... పోలీసులు కూడా ఏం చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తూ.. అలాగే చూస్తుండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది. ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసిన తరువాత కూడా ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అందరూ ప్రయాణించే రోడ్లపై ఇలాంటి సాహసాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా విన్యాసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.