Telangana Minister Mahmood Ali slapped Gunman Video Viral: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన తెలంగాణ మంత్రి అలీ.. వీడియో వైరల్‌

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 2:09 PM IST

thumbnail

Telangana Minister Mahmood Ali slapped Gunman Video Viral: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని తమ జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందజేస్తున్నారు. హైదరాబాద్​లోని అమీర్​పేటలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సీఎం అల్పాహార పథకం ప్రారంభోత్సంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహమూద్ అలీ మంత్రి తలసానిని చూడగానే పలకరించేందుక వెళ్లారు. తలసానిని ఆలింగనం చేసుకునే క్రమంలో మహమూద్ అలీ చేసిన పనికి అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. తలసానిని ఓ వైపు ఆలింగనం చేసుకున్న మంత్రి.. అకస్మాత్తుగా అక్కడున్న గన్​మెన్​ను దగ్గరికి పిలిచారు. ఎందుకు పిలిచారో అని అతడు ఆలోచిస్తుండగానే.. ఒక్కసారిగా మంత్రి గన్​మెన్​ చెంప పగులగొట్టారు. ఈ సంఘట చూసి అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన కింద పని చేసే వ్యక్తి పట్ల ఓ మంత్రి ఇలా ప్రవర్తించడం సరికకాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

TAGGED:

ali

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.