బోథ్​ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున సోయం బాపురావు పోటీ

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 4:15 PM IST

thumbnail

Soyam Bapurao contested on behalf of BJP from Both constituency : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది శాసనసభ  నియోజకవర్గాల్లో బోథ్‌ అత్యంత కీలకంగా మారింది. బీజేపీ తరపున ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండటంతో బీఆర్​ఎస్​తో పాటు కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పార్లమెంట్‌ సభ్యుడిగా జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని.. బీఆర్​ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు తనకు పోటీనే కాదంటున్నారు. 

Bapurao is contesting on behalf of BJP : గిరిజనేతరుల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడానని సోయం అన్నారు. ఇదివరకు తాము చేసిన పనులను డప్పువేసి చెప్పుకోమని ఎంపీ బాపురావు వెల్లడించారు. బీఆర్​ఎస్​ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్​ దిట్టని సోయం ఆరోపించారు. డబుల్​ బెడ్​ రూంలు అర్హులకు అందలేదని.. ఉద్యోగులు కల్పించడంలో అధికార పార్టీ విఫలం అయిందని బాపురావు తెలిపారు.

     'నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి చేశా. ప్రజలకు తాగునీటి సమస్యను సాగునీటి సమస్యను లేకుండా చేశా. ఇళ్లు లేనంటువంటి నిరుపేదలకు ఇళ్లు ఇచ్చా. అతిసార, మలేరియా వంటి వ్యాధుల నిర్మూలనకు కృషి చేశా. పోడు వ్యవసాయం చేసుకునే కర్షకులకు పట్టా పంపిణీ చేశా. పిట్​లైన్​ సమస్యను తీర్చానని, పిట్​లైన్​ను ఔరంగబాద్​ నుంచి ఆదిలాబాద్​ తీసుకొచ్చి ఉపాధి ప్రజలకు కల్పించా. ఆదిలాబాద్​-ఆర్మూర్​-బోధన్​-సంగారెడ్డి-పటాన్​చెరు రైలు మార్గానికి సంబంధించిన పైనల్​ లోకేషన్ సర్వే పూర్తి చేయడంలో చొరవ తీసుకున్నా. ఉమ్మడి ఆదిలాబాద్​లో ఆదివాసీ, గిరిజన గ్రామాలలో  విద్యార్థుల కోసం నెట్​వర్క్​కు సంబంధిచిన 160 టవర్​లను తీసుకొచ్చా. ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలనేదే నా లక్ష్యం' - సోయం బాపురావు, బీజేపీ ఎంపీ   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.