ప్రశ్నించే గొంతుక అన్న తీన్మార్ మల్లన్న - హమీల అమలును ఎందుకు అడగటం లేదు : రాకేశ్ రెడ్డి - BRS mlc candidate Campaign

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 1:51 PM IST

thumbnail
ప్రశ్నించే గొంతుకా అన్న తీన్మార్ మల్లన్న హమీల అమలును ఎందుకు అడగటం లేదు రాకేష్ రెడ్డి (ETV Bharat)

Nalgonda BRS MLC Candidate Election Campaign : ఒక్క అవకాశం ఇస్తే విద్యావంతులకు, మేధావులకు, తెలంగాణ సబ్బండ వర్గాలకు న్యాయం చేయడానికి సర్వశక్తులా పోరాటం చేస్తానని పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రజలు మంచి వ్యక్తులను గెలిపిస్తారని, ఈ ఉప ఎన్నికల్లో గెలుస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నల్గొండలోని ఎన్జీ కళాశాల, జిల్లా గ్రంథాలయం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని కూడా నిరుద్యోగుల కోసం ఖర్చు చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రశించే గొంతుక అంటూ చెప్పుకునే వ్యక్తి మల్లన్న మెగా డీఎస్సీ, నిరుద్యోగబృతి, జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్​పై ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.