అమ్మ బాబోయ్! ఆమె జడ పొడవు 8 అడుగుల 7 అంగుళాలు

By

Published : Jul 31, 2023, 7:35 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ హల్ద్వానీకి చెందిన ఓ మహిళ జుట్టును పెంచి రికార్డులు సాధించింది. 36 ఏళ్ల రేణు దరియాల్​కు జుట్టును పెంచడం అంటే సరదా. ఆ తర్వాత అదే ఆమె అభిరుచిగా మారింది. ప్రస్తుతం ఆమె జడ పొడవు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. 2015 నుంచి జుట్టును పెంచుతుండగా.. ప్రస్తుతం ఆమె జడ పొడవు 8 అడుగుల 7 అంగుళాలకు చేరింది. దీంతో ఇండియా స్టార్ బుక్​ ఆఫ్ రికార్డ్స్​, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​, ఉత్తరాఖండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్​తో పాటు పలు అవార్డులను సంపాదించుకుంది. తన తర్వాతి లక్ష్యం లిమ్కా, గిన్నిస్​ బుక్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించడమేనని చెబుతోంది రేణు.

రేణు చిన్నానాటి నుంచి జుట్టును పెంచుతోంది. అయితే 2015 తర్వాత ఆమెకు అది అభిరుచిగా మారింది. ఆ తర్వాత రోజులో ఒక గంట సేపు కచ్చితంగా జుట్టు సంరక్షణ కోసం కేటాయించడం ప్రారంభించింది. వివిధ రకాల షాంపూలు, రసాయనాలతో కాకుండా.. కేవలం ఇంట్లో లభించే అలోవెరా, ఉసిరి లాంటి పదార్థాలతోనే వెంట్రుకలను శుభ్రం చేస్తోంది రేణు. తాను హెయిర్ డ్రయర్​ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులను సైతం వినియోగించనని తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.