President Visited Shirdi Sai Baba Temple : షిర్డీ సాయినాథు​ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

By

Published : Jul 7, 2023, 7:18 PM IST

thumbnail

Draupadi Murmu visited Shirdi Sai Baba Temple : రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నేడు షిర్డీలోని సాయిబాబా సమాధిని సందర్శించారు. మహారాష్ట్ర గవర్నర్​ రమేశ్​ బాయిస్​, ఆ రాష్ట్ర దేవాదాయ, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, ఎంపీ సదాశివరావు లోఖండే ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ద్రౌపదిముర్ము మొదట 'ద్వారకామయి'ని సందర్శించారు. అనంతరం సాయిబాబా సమాధి ఆలయాన్ని దర్శించుకుని పాదపూజ, హారతి నిర్వహించారు. సమాధి ఆలయాన్ని సందర్శించిన అనంతరం గురుస్థాన్ ఆలయంలో నిమ్మ చెట్టు చుట్టూ రాష్ట్రపతి ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత సాయిబాబా మ్యూజియాన్ని సందర్శించారు. సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శివశంకర్ మ్యూజియంలోని వస్తువులు, చిత్రాల గురించి రాష్ట్రపతికి వివరించారు.

కార్యక్రమంలో సాయిబాబా సంస్థాన్ అండ్ హాక్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ యార్లగడ్డ, సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివశంకర్, జిల్లా పోలీస్​ సూపరింటెండెంట్ రాకేశ్​ ఓలా తదితరులు పాల్గొన్నారు. అహ్మద్‌నగర్ జిల్లా యంత్రాంగం తరఫున సంరక్షక మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శివశంకర్​ రాష్ట్రపతిని సత్కరించారు.

దర్శనానంతరం రాష్ట్రపతి వాహన శ్రేణి.. సాయి ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరింది. రాష్ట్రపతి కారు.. రహదారిపైకి రాగానే అక్కడ ఉన్న సాయి భక్తులు ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో రాష్ట్రపతి తన కారు దిగి అక్కడున్న వారికి అభివాదం చేశారు. దాదాపు 100 మీటర్లు నడిచి వెళ్లి అక్కడున్న వారందరికీ అభివాదం చేశారు. రాష్ట్రపతి తీరు పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.