Prathidwani : రాష్ట్రంలో డెంగీ పంజా.. విజృంభిస్తున్న విష జ్వరాలు

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 10:14 PM IST

thumbnail

Prathidwani Debate on Dengue Fevers : రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ జ్వరాలు ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. గడిచిన సెప్టెంబర్‌లోనే కేసులు తారస్థాయికి చేరాయి. ఈ నెల ఇప్పటికే నమోదైన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండా.. తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతంగా మారుతున్న ఉదంతాలు కలవర పెడుతున్నాయి. 

Dengue Fevers in Telangana : రాష్ట్రంలో ఇప్పటికే డెంగీ కేసులు అధికారికంగానే 6 వేలు దాటాయి. అందులో దాదాపు సగం జీహెచ్​ఎంసీ పరిధిలోనివే. ప్రజల్ని గుళ్ల చేస్తున్న విషజ్వరాలు వీటికి అదనం. ఈ సంవత్సరం డెంగీ జ్వరాలు మరింతగా భయపెడుతూ ఉండడానికి కారణమేంటి? డెంగీ లేదా విషజ్వరాల నుంచి రక్షణకు ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో పారిశుద్ధ్యం, ఇంటి పరిసరాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్థానిక సంస్థలు ఏం చేయాలి?  ప్రజారోగ్య పరిరక్షణ కోణంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.