Ponguleti fires on KCR : "కేసీఆర్.. రైతులను ఎందుకు కోటీశ్వరులను చేయడం లేదు"

By

Published : Jul 17, 2023, 2:29 PM IST

thumbnail

Ponguleti Srinivas Reddy fires on BRS : వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదించానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలో రైతులందరిని కోటీశ్వరులను ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ ​నేత హన్మంతరావుని.. ఆయన స్వగృహంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్​గా పదవికి నియమించినందుకు ఏఐసీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

క్యాప్సికం పండించడం ద్వారా ఎకరానికి 10 కోట్లు ఆదాయం సంపాదించవచ్చని చెప్పిన కేసీఆర్.. రాష్ట్ర రైతులను ఎందుకు కోటీశ్వరులను చేయలేకపోయారని ప్రశ్నించారు. రాహుల్​గాంధీకి ఎడ్లకు, వడ్లకు తేడా తెలియదని విమర్శించిన కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. భారత్​ జోడోయాత్రలో రాహుల్​గాంధీ రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారన్నారు. ఉచిత కరెంట్ సరఫరా కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని.. రేవంత్​రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న మార్పును, తెలంగాణ ప్రజల ఆకాంక్షను.. కాంగ్రెస్ పార్టీ గెలిపించి సోనియాగాంధీకి గిఫ్టుగా అందించే క్రమంలో నా వంతు కృషి చేస్తానని పొంగులేటి తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.