కాంగ్రెస్‌తోనే ప్రజా పాలన సాధ్యం : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Ponguleti Srinivas Election Campaign In Khammam 2023 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మం పట్టణంలోని పెద్ద కూరగాయల మార్కెట్లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దోపిడీదొరల పాలన కావాలా.. ప్రజా ప్రభుత్వం కావాలో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. పేదవాడి కల నేరవెరాలన్నా.. రైతుల ఆశలు నేరవేరాలన్నా.. బడుగు బలహీన మైనార్టీ, దళిత అభీష్టం సిద్ధించాలన్నా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంతోనే అదంతా సాధ్యం అవుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై ప్రజలు చరమగీతం పాాడాలని పొంగులేటి పిలుపునిచ్చారు. అక్రమంగా కేసులు పెట్టే దందాల పాలనకు నవంబర్ 30న ఫుల్స్టాప్ పెట్టాలని ఓటర్లను కోరారు. బలహీన వర్గాల కోసం అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వ్యాపారులకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యమన్న పొంగులేటి.. చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా మార్కెట్‌కు వచ్చిన పొంగులేటికి వ్యాపారులు ఘన స్వాగతం పలికారు.