Podu Land Pattas : రాష్ట్రంలో రేపు పోడు పట్టాల పంపిణీ

By

Published : Jun 29, 2023, 10:28 AM IST

Updated : Jun 29, 2023, 10:37 AM IST

thumbnail

Podu Land Pattas Distribution in telangana : పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం రోజున ఆసిఫాబాద్‌లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఈ విషయాన్ని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రోజున పోడు పట్టాల పంపిణీపై మంత్రి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోడు హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 3 లక్షల 8 వేల ఎకరాలను పంపిణీ చేస్తే.. రేపు 4 లక్షల 6 వేల ఎకరాలను పంపిణీ చేస్తామన్నారు. ఇంత మందిని భూ యజమానులుగా చేయడం చరిత్రలో గొప్ప విషయమని గిరిజనుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్​కు మంత్రి సత్యవతి రాఠోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు పోడు పట్టాలను మంత్రి హరీశ్​రావు పంపిణీ చేస్తారు. మహబూబాబాద్​లో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాఠోడ్​లు పట్టాల పంపిణీ ప్రారంభిస్తారు. అంతే కాక మహబూబాబాద్​లో రూ.50 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

Last Updated : Jun 29, 2023, 10:37 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.