MP Laxman Reaction on Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​ సబబు కాదు : లక్ష్మణ్

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 5:30 PM IST

thumbnail

MP Laxman Reaction on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్​లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్​ సబబు కాదని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఈ అరెస్టును తప్పుబడుతోందని తెలిపారు. ఆయనను ఎలాంటి వివరణ లేకుండా అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఎఫ్​ఐఆర్​లో పేరు చేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu)ను ఏపీ సీఐడీ పోలీసులు స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో శనివారం ఉదయం అరెస్ట్​ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్​ జైలుకి పోలీసులు తరలించారు.  

MP Laxman Speech on Jamili Elections : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా చేస్తోందని తెలిపారు. మాజీ రాష్ట్రపతి నివేదిక వచ్చిన అనంతరం.. పార్లమెంట్​లో బిల్లు పెట్టి అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మార్చి లేదా ఏప్రిల్​లో లోక్​సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్​ లేదా డిసెంబర్​లో జరుగుతాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.