వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలి : ఎంపీ ధర్మపురి అర్వింద్

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 4:17 PM IST

thumbnail

MP Dharmapuri Arvind participate in Vikas Bharat Sankalpa Yatra Programme : నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం పిప్రీ గ్రామంలో జరిగిన వికాస్​ భారత్​ సంకల్ప యాత్రలో ఎంపీ ధర్మపురి అర్వింద్​ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్​కు స్థానిక గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో అమలు చేయబడుతున్న పథకాలకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఉన్న క్యాలెండర్​ను విడుదల చేశారు.

అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో అమలవుతున్న పథకాలను వివరించారు. రేషన్​ కార్డుల దరఖాస్తుకు పరిమితి లేదని, అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాబోయే ఐదు సంవత్సరాలు ఉచితంగా రేషన్​ సరుకులు అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇన్యూరెన్స్​ స్కీంల ద్వారా అందుతున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులను ఆదుకునేందుకు కిషన్​ సమ్మాన్​ నిధి ద్వారా వ్యవసాయ సేవకు నిధులు అందిస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.