అదరగొట్టిన సూక్ష్మ కళాకారుడు- 200 గ్రాముల పసిడితో రాముడి పాదుకలు, అల్లాకు బంగారు ఇటుక తయారీ!

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 9:46 PM IST

thumbnail

Micro Gold Artist In Rajasthan : రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు బంగారంపై రాముడు, అల్లా పేర్లను చిత్రీకరించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. వాటితో పాటు బంగారు గంట, పాదుకలను రూపొందించారు. కేవలం 200 గ్రాముల బంగారంతో ఇన్ని వస్తువులను తయారుచేశారు. ఈ క్రమంలో ఇక్బాల్ సక్కా ప్రతిభపై కళాకారులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

"నేను ప్రపంచంలో అతి సూక్ష్మమైన రాముడి పాదుకలను తయారు చేశాను. అవి మాత్రమే కాకుండా ఓ గంటనూ కూడా తయారుచేశా. పసిడి ఇటుకను రూపొందించా. దాని పరిమాణం కేవలం 3మిల్లీమీటర్లే. వీటన్నింటినీ ఒకటి నుంచి మూడు మిల్లీమీటర్లలో పరిమాణంలోనే తయారు చేశాను. బంగారంతో రూపొందించిన వీటిపై రామ్​ అని రాశాను. దీంతో పాటు మసీదులో ప్రార్థన సమయంలో ఉపయోగించే చాప, బంగారు ఇటుకపై అల్లా అని అరబిక్ భాషలో రాశాను".
- ఇక్బాల్ సక్కా, సూక్ష్మ కళాకారుడు.

అయోధ్యలోని రామమందిరంలో నిర్మిస్తున్న మ్యూజియంలో తాను తీర్చిదిద్దిన కళాకృతులను ప్రదర్శించాలని ఇక్బాల్ ఆకాంక్షించారు. 'నేను బంగారంతో రూపొందించిన ఈ సూక్ష్మ రూపాలు అయోధ్య రామమందిర మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలనుకుంటున్నాను. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. నేను పంపిన లేఖకు హోం మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి స్పందన లభించింది. వారు నాకు అయోధ్య రామమందిర ట్రస్ట్​ అడ్రస్​ను పంపించారు. నేను రూపొందించిన కళారూపాలను అక్కడ ఉంచాలనుకుంటున్నానని వారికి తెలియజేశాను' అని ఇక్బాల్ సక్కా తెలియజేశారు. తన అభిరుచిలో భాగంగా ఈ సూక్ష్మ కళాకారుడు భారత త్రివర్ణ పతాకాన్ని బంగారంతో రూపొందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.