Road Accident : బైక్కు ఢీకొట్టిన బస్సు.. జగిత్యాలలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
Published: May 22, 2023, 8:04 PM

Major Road Accident in Jagtial District : ఈ మధ్య కాలంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగంగా వాహనాలను నడుపుతూ విచక్షణ కోల్పోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. క్షణాల్లో ప్రమాదాలకు గురయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించక రోడ్డు దాటే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.
జగిత్యాల కోరుట్ల ప్రధాన రహదారిపై ఇలాంటి ఘటనే జరిగింది. ప్రైవేట్ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల నుంచి ముంబయి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోరుట్ల మండలం వెంకటాపూర్ స్టేజి వద్ద బైక్ను ఢీకొట్టింది. అతివేగంగా వస్తున్న బస్సును గమనించకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో భారీ శబ్దంతో ఇద్దరు కిందపడిపోయి ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మృతుడిని మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన పంచతి హనుమాన్లుగా గుర్తించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి రాజంకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.