యూనివర్సిటీలో చిరుత హల్​చల్​.. పట్టించుకోని ఫారెస్ట్​ సిబ్బంది.. విద్యార్థులు హడల్​!

By

Published : Jan 14, 2023, 10:31 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

కర్ణాటకలోని బెంగళూరు యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. క్యాంపస్​లో ఓ చిరుత సంచారం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. ఫారెస్ట్​ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు, యూనివర్సిటీ సిబ్బందికి సర్క్యులర్​ జారీ చేసి  జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది యాజమాన్యం. అయితే కొన్నిరోజుల క్రితం ఎన్​ఎస్ఎస్​ భవన్​ వెనుక ఉన్న అడవిలో చిరుతను చూసినట్లు కొందరు వ్యక్తులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా యూనివర్సిటీ ఛాన్సలర్​ అటవీ శాఖ అధికారులకు లేఖ రాసినా ఎటువంటి స్పందన రాలేదు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.