Kodi Punju in Lockup : లాకప్​లో కోడి పుంజు.. ఇంతకీ ఏం నేరం చేసింది..?

By

Published : Jul 11, 2023, 12:35 PM IST

thumbnail

Kodi Punju in Lockup Jadcherla : ఎక్కడైనా దొంగతనాలు, దోపీడీలు జరిగితే నిందితులను లాకప్​లో వేస్తారు. బాధితులను పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి విచారిస్తారు. కానీ ఓ పోలీసు స్టేషన్​లో మాత్రం నిందితుడితో సహా బాధితుణ్ని కూడా స్టేషన్​లో వేశారు.. విచిత్రం ఏంటంటే బాధితుడు మనిషి కాదు ఓ కోడి..ఇంతకీ ఆ కొక్కొరొక్కో కోడి ఎందుకు జైలు పాలైనట్టు..?

ఎక్కడైనా పోలీస్​ స్టేషన్​ లాకప్​లో నిందితులుండటం చూశాం... కానీ జడ్చర్ల పోలీసులు మాత్రం స్టేషన్‌లో కోడిపుంజును ఉంచారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి శివారులో తరచు నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కరువెన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దొంగతనం చేస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని కోడిపుంజుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. వారు ఆ వ్యక్తితో పాటు కోడిని లాకప్​లో ఉంచారు. కాగా రెండు రోజులుగా పోలీసులు వేసే గింజలను తింటూ కోడిపుంజు పోలీస్ స్టేషన్​లో కూతబెడుతుండడంతో అక్కడి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్టేషన్‌లోని కుక్కలు చంపుతాయనే భయంతో కోడిని లాకప్‌లో పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.