మహిళా కార్యకర్త అత్యుత్సాహం.. మోదీ వాహనంపైకి ఫోన్ విసిరి..

By

Published : May 1, 2023, 12:36 PM IST

thumbnail

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ మహిళా కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రచార పర్వంలో భాగంగా రోడ్​షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వాహనంపైకి ఆ మహిళ ఫోన్ విసిరారు. చివరకు ఏం జరిగిందంటే?

ప్రధాని మోదీ ఆదివారం మైసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై రోడ్‌ షోలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ సమయంలో బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ప్రధాని వైపుగా మొబైల్​ ఫోన్‌ను విసిరారు. అది కాస్త వాహనం బానెట్‌పై పడింది. అప్పటికే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్(ఎస్‌పీజీ)​ రక్షణలో ఉన్న ప్రధాని.. దానిని గమనించి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్(ఎస్‌పీజీ)​ను అప్రమత్తం చేశారు.

వెంటనే అలర్ట్​ అయిన పోలీసులు ఫోన్​ విసిరిన మహిళను గుర్తించి ప్రశ్నించారు. కేవలం మోదీని చూసిన ఆనందంలోనే తాను అలా చేశానని వివరించారు. అనంతరం ఆ ఫోన్​ను ఆమెకు అందించారు. ఈ ఘటనలో ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై మేం దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్షాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దీంట్లో భాగంగానే శని, ఆదివారాలు పలు ప్రాంతాల్లో మోదీ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.