ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈరోజు అద్భుత గ్రహ సంచారం! బంగారం కూడా కొంటారు! - daily horoscope telugu today

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 4:57 AM IST

Horoscope Today May 9th 2024 : మే​ 9న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 9th 2024
Horoscope Today May 9th 2024 (ETV Bharat)

Horoscope Today May 9th 2024 : మే​ 9న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వృత్తివ్యాపారాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సూర్య ఆరాధనతో ఆరోగ్యం మెరుగు పడుతుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అద్భుతంగా ఉంది. ఈ రోజు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. మీ అదృష్టం ఈ రోజు మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేస్తుంది. నమ్మశక్యం కానీ అదృష్టాన్ని అందుకోబోతున్నారు. ఏకాగ్రతతో పనిచేసి బ్రహ్మాండమైన విజయాలను సాధిస్తారు. ఆర్ధిక పరంగా కూడా ఈ రోజు పలు ప్రయోజనాలు ఉంటాయి. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. సమయానుకూలంగా నడుచుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు, ఒత్తిడి, అపార్థాలూ, కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, అనవసరమైన వివాదాలు రావచ్చు. నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సంబంధమైన లబ్ధి, ఆదాయ వృద్ధి ఉంటాయి. కొత్తగా పెట్టుబడులను సమకూర్చుకోడానికి అనుకూలమైన రోజు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో మీ మీరు చేసే అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్థులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మీ ధైర్యమే మీ బలం. అదే ఈ రోజు మీకు విశేషమైన గుర్తింపు తీసుకు వస్తుంది. ప్రభుత్వవిషయాలకు సంబంధించిన, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాకుమెంట్లు చూడడానికి మంచి రోజు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆంజనేయ స్వామి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు జాతకపరంగా ఒక్క ప్రతికూలత కూడా లేదు. మీ రోజును దైవ ప్రార్ధనతో మొదలు పెడితే రోజంతా మంచే జరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి అందిన శుభ సమాచారం మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి కాలం కలిసిరాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సరికాదు. సన్నిహితులతో ముందు కఠినంగా మాట్లాడి తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు జాగ్రత్త. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. జాగ్రత్తగా మాట్లాడాలి. సమస్యలు తీరాలంటే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రార్థన ధ్యానాది కార్యక్రమాలు చేయడం మంచిది. అందువల్ల సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. బాధ్యతలు, తీరిక లేని పనుల నుంచి విశ్రాంతి తీసుకోండి. స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడపండి. విందు వినోదాల్లో పాల్గొనండి. ఆర్ధిక పరమైన ప్రయోజనాలు ఉంటాయి. సామాజిక సేవా రంగంలో ఉండే వారు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉండేవారు అద్భుతాలు సాధిస్తారు. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒక్కసారిగా కలిసి వస్తాయి. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉంటుంది. రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. ఉద్యోగస్థులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక లాభం సూచితం. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతం తాలూకు చెడు ప్రభావాలు ఇంకా తొలగిపోలేదు. మానసికంగా అస్థిరంగా ఉంటారు. మిమ్మల్ని కలిచి వేసే బాధకు కారణం మీకే తెలియక పోవచ్చు. వ్యాపారస్థులకు ఆర్ధిక నష్టం సూచితం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు. పని ప్రదేశంలో, ఇంట్లో కలహాలు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శని శ్లోకాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉండవచ్చు.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను తీసుకు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. చేసే పనిలో స్పష్టత లేనందున పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులు పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సామాజిక సేవా రంగంలో ఉండే వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దుర్గా దేవి ధ్యానంతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపారా రంగాల వారు సమష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు. సానుకూల ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన వ్యహారాల్లో మీరు సూచించిన సలహాలను పాటించి అందరూ విజయాన్ని సాధిస్తారు. దీనితో ఒక్కసారిగా మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపారస్థులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. గురు శ్లోకాలు పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.