కోపంతోనో, కసితోనో ఓటేయకండి - ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి : జయప్రకాశ్ నారాయణ

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 9:39 PM IST

thumbnail

Jayaprakash Narayan on Telangana Assembly Elections : భవిష్యత్ తీర్చిదిద్దే ఓటును ఆలోచించి వేద్దామని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా.. ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుందో వారినే గెలిపించాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఓటు అనేది ఆరోజు కోపంతోనో.. కసితోనే వేసిది కాదన్నారు. ఓటు మన భవిష్యత్‌ను తిర్చుదిద్దుతుందని చెప్పారు. రేపటి రోజు ఏం జరుగుతుందోనని ఆలోచించి ఓటేయ్యాలని సూచించారు.

'డబ్బులతో ఓటులను కొనడం అన్ని పార్టీలవారు చేస్తున్నారు. నాకు ఒక ఆశ కిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్‌ను కాపాడాలి.. మనందరికీ మంచి జీవతం కావాలంటే.. ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగడం. డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చుపెట్టి తర్వాత ఏమి లేకుండా చేసేవాళ్లు కచ్చితంగా భవిష్యత్‌కి ప్రమాదమవుతారు. ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుంది.. ఎవరి వల్ల మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎవరి వల్ల పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు పెరుగుతాయో ఆలోచన చేయ్యాలి.' -జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.