సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ : జగదీశ్ ​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 10:47 PM IST

thumbnail

Jagadish Reddy Fires on Congress Government : సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలనల్లో అందించిన కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారన్న ఆయన, బీఆర్ఎస్ హయాంలో సంక్షేమానికి ఇన్ని అడ్డంకులు లేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తోందని, ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని వ్యాఖ్యానించారు. 

Jagadish Reddy on Lok Sabha Elections 2024 : పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతామన్న ధీమా భువనగిరి సన్నాహక సమావేశం సందర్భంగా కార్యకర్తల్లో కనిపించిందని జగదీశ్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ను గెలిపించేందుకు బీజేపీ చేసిన కుట్రను కూడా కార్యకర్తలు ప్రస్తావించారని, కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగట్టాల్సిందేనని కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలే తమకు ముఖ్యమన్న ఆయన, వారు కోరుకున్న రీతిలోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్​ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను సమావేశం తీవ్రంగా పరిగణించిందని, తప్పుడు కేసుల బాధిదితులకు పార్టీ అండగా ఉంటుందని జగదీశ్​రెడ్డి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.