ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం - న్యాయం చేయాలని బాధితులు ఆవేదన - Job Fraud Case in Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Jun 1, 2024, 3:08 PM IST
Job Fraud in Hyderabad : భాగ్యనగరంలో ఉద్యోగాల పేరిట మోసం చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారని పోలీసులు అవగాహన కల్పిస్తున్న ఆ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలియని వ్యక్తి జాబ్ ఇస్తానని చెబితే ఏమి ఆలోచించకుండా డబ్బులు ఇచ్చి నిరుద్యోగులు మోసపోతున్నారు. తాజాగా నగరంలో సుమారు 50 మంది నిరుద్యోగులు ఓ వ్యక్తి మాయ మాటలు విని మోసపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లికి చెందిన కేతావత్ సంతోశ్ ఇండియన్ ఎయిర్పోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు 50 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి రెండు కోట్లు వరకు తీసుకున్నాడు. వారికి నకిలీ హాల్టికెట్లు, సర్టిఫికెట్లు ఇచ్చి ఒక్కో బాధితుడి దగ్గర రూ.6 లక్షలు వసూలు చేశాడు. జాయినింగ్ అర్డర్ తేదీ వచ్చే సరికి సంతోశ్ కనిపించే సరికి మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. అతని వివరాలు పూర్తిగా తెలియవని బాధితులు చెబుతున్నారు. మోసపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బాధితులు తెలియజేస్తున్నారు.