IT employees met Bhuvaneshwari: ఆంక్షలు దాటుకుంటూ.. రాజమండ్రికి చేరిన ఐటీ ఉద్యోగుల అభిమానం

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 5:50 PM IST

Updated : Sep 24, 2023, 6:17 PM IST

thumbnail

IT employees met Bhuvaneshwari: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్​కు నిరసనగా ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీ రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు నారా భువనేశ్వరి, బ్రాహ్మణులను కలిసిశారు. వారిని సంఘీభావం తెలిపేందుకు రాజమహేంద్రవరం వచ్చినట్లు ఐటీ ఉద్యోగులు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఐటీ ఉద్యోగులు ఆరోపించారు. పోలీసులు తమ ర్యాలీని అడ్డుకోవడంపై ఐటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టి పెరిగిన రాష్ట్రానికి  వచ్చేందుకు పోలీసులు ఇన్ని ఆంక్షలు విధించాలా అంటూ  ఐటీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. ఆధ్రప్రదేశ్​కు రావాలంటే పాస్​పోర్ట్ తీసుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు.  తాము  చంద్రబాబు వల్లే ఐటీ ఉద్యోగాలు సాధించామని తెలిపారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే.. ఏపీ అభివృద్ధి సాధ్యమని ఐటీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రభుత్వం కేవలం కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో  వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. 

Last Updated : Sep 24, 2023, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.