'కాంతార' నృత్యం చేస్తూ కుప్పకూలిన కళాకారుడు.. అక్కడికక్కడే..!

By

Published : Mar 30, 2023, 7:01 PM IST

thumbnail

భూతకోల నృత్యం చేస్తున్న కోల కళాకారుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటన కర్ణాటకలోని ఎడమంగళ గ్రామంలో జరిగింది. అజిలా ములంగిరి అనే నర్తకుడు కొన్నేళ్లుగా ఈ నృత్య ప్రదర్శన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా నిర్వహించే నేమోత్సవంలో భాగంగా సంప్రదాయ నృత్యం చేసేందుకు వచ్చిన ములంగిరి ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం.. కర్ణాటక మండ్య సమీపంలో పౌరాణిక నాటక ప్రదర్శనలో ఓ కళాకారుడు వేదికపైనే ప్రాణాలు విడిచాడు. సార్థకి వేషంలో నటిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బండూర్ గ్రామంలో బసవన్న ఆలయంలో 'కృష్ణ సంధానం' అనే నాటక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వేర్వేరు గ్రామాల నుంచి కళాకారులు వచ్చారు. సార్థకి పాత్రధారి అయిన నంజయ్య(46) అనే వ్యక్తి స్టేజిపై ప్రదర్శన ఇస్తుండగా.. ఆయనకు గుండెపోటు వచ్చింది. నంజయ్య వేదికపైనే కుప్పకూలిపోయాడు.ఈ హఠాత్​ పరిణామంతో తోటి కళాకారులు, నిర్వాహకులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. వెంటనే నాటక ప్రదర్శనను మధ్యలోనే ఆపేసి.. ఆ కళాకారుడిని మలవల్లి పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు స్టేజిపైనే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.