Delhi Liquor Case: సుప్రీంకోర్టు ఆదేశాలు.. ఈడీ ముందు లొంగిపోయిన మాగుంట రాఘవ

By

Published : Jun 12, 2023, 7:11 PM IST

thumbnail

Magunta Raghava surrendered to the ED: దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయారు. తాజాగా మాగుంట రాఘవ బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం..15 రోజుల నుంచి ఐదు రోజులకు కుదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాఘవ.. ఈ నెల 12వ తేదీన స్థానిక కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారమే నేడు మాగుంట రాఘవ తిహాడ్‌ జైలు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు లొంగిపోయాడు.

ఈ నెల 8వ తేదీన.. దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మాగుంట రాఘవ బెయిల్‌ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు కుదించింది. ఈనెల 12న స్థానిక కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.