రాష్ట్రంలో అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారు : జగదీశ్ రెడ్డి

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 8:03 AM IST

thumbnail

BRS Minister Jagadish Reddy Interview : తాగు, సాగు నీరు లేక.. ఏళ్లుగా ఇబ్బందులు పడిన సూర్యాపేట ప్రజలు.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఉపశమనం పొందారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్​ఎస్ అధికారంలోకి రావాలన్నారు. నియోజకవర్గంలోని గులాబీ పార్టీపై ప్రజల ఆదరణ ఉందని, తమ ప్రభుత్వం కొనసాగుతుందనే భావన ప్రజల్లో కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసే పార్టీకే ప్రజలు ఓటేస్తారని, అందుకే బీఆర్ఎస్​కు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పనుల వల్లే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని జగదీశ్ రెడ్డి అన్నారు. మెడికల్​ కళాశాల నిర్మించామని, కార్పొరేట్​ స్థాయికి దీటుగా త్వరలో గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ టవర్, ఇండస్ట్రియల్​ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్న జగదీశ్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.