చేతులు విడిచిపెట్టి వృద్ధుడి బైక్​ స్టంట్స్​.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

By

Published : Apr 18, 2023, 9:01 PM IST

thumbnail

గుజరాత్​లో ఓ వృద్ధుడు బైక్​పై విన్యాసాలు చేశాడు. ఎలాంటి రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా బైక్​తో స్టంట్స్​ చేశాడు. తనతో పాటు రోడ్డులో ప్రయాణించే ఇతరులకు కూడా ఇబ్బంది కలిగేలా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.  
రాజ్​కోట్​ నగరంలో ఓ వృద్ధుడు చేతులు విడిచిపెట్టి బైక్​పై ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. సిటీలోని 150 అడుగుల రింగ్​ రోడ్డులో బైక్​పై పడుకుని.. నిలబడి.. రకరకాల స్టంట్స్​ చేశాడు. ఆ సమయంలో రోడ్డు భద్రత నియమాలేవీ పాటించలేదు. కనీసం హెల్మెట్​ కూడా పెట్టుకోలేదు. అంతే కాకుండా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసి.. వారికి ఇబ్బంది కలిగించాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు మొబైల్​లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్​గా మారి.. పోలీసుల దృష్టికి వెళ్లింది. వీడియోలో క్లియర్​గా కనిపిస్తున్న బైక్​ నంబర్​ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.