Nara Bhuvaneswari 'Nijam Gelawali' Tour Updates: 'మృతుల కుటుంబాలకు తెలుగుదేశం అన్ని విధాలా తోడుగా ఉంటుంది'

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 1:50 PM IST

thumbnail

Nara Bhuvaneswari 'Nijam Gelawali' Tour Updates: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర నేటితో మూడోవ రోజుకు చేరుకుంది. నేటి యాత్రలో.. రేణిగుంట మండలానికి చెందిన ఎర్రంరెడ్డిపాలెం, మునగాలపాలెంలో భువనేశ్వరి పర్యటించారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి.. ఆర్థికసాయం అందించారు.

Bhuvaneswar Financial Assistance to Deceased Families: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో మనోవేదనకు గురై, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజు తిరుపతి జిల్లా నారావారిపల్లెలో పర్యటించిన ఆమె.. రెండో రోజు శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మూడోవ రోజు ఎర్రంరెడ్డిపాలెంలోని సూరా మునిరత్నం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి..మృతుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది, మృతి చెందిన మృతుల కుటుంబాలకు పార్టీ అన్నీ రకాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.