Baby Movie Heroine at Bonalu Celebrations : అమ్మవారికి బోనం సమర్పించిన.. బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య

By

Published : Jul 9, 2023, 9:41 PM IST

thumbnail

Vaishnavi Chaitanya on Bonalu Festival : హైదరాబాద్​లో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు.ఈ సందర్భంగా బేబీ సినిమా హీరోయిన్‌ వైష్ణవి చైతన్య .. అమ్మవారికి బోనం సమర్పించారు. బేబీ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. చిత్రం ఘనవిజయం సాధించేందుకు అమ్మవారి ఆశీస్సులు కావాలంటూ.. చిత్ర బృందం ఈ మేరకు ట్విటర్​లో ట్వీట్​ చేసింది. ఈ మేరకు హిరోయిన్ వైష్ణవి బోనం ఎత్తుకున్న వీడియోను పోస్ట్​ చేశారు.  

ఇటీవలే బేబీ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ సినిమా కథానాయకుడిగా ఆనంద్​ దేవరకొండ నటిస్తున్నారు. వైష్ణవి చైతన్య తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలే. సాఫ్ట్​వేర్​ డెవలపర్​ షార్ట్​ ఫిలింతో అందరి మన్ననలు పొందింది. ఈ అందాల తార అప్పటి నుంచి పలు లఘు చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్​ నటించిన అల వైకుంఠపురంలో హీరోకి చెల్లిగా నటించింది. వరుడు కావలెను సినిమాలో ప్రముఖ పాత్ర పోషించింది. తెలుగులో పలు మూవీల్లో నటించి ప్రేక్షకులని అలరించింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.