మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి​ మధ్య ప్రొటోకాల్ వివాదం

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 11:24 AM IST

thumbnail

Argument Between Minister Konda Surekha And Palla Rajeshwar : శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం జాతర ఏర్పాట్ల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట హరిత హోటల్​లో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీక్షా సమావేశంలో మంత్రి కాంగ్రెస్ నాయకులను స్టేజీ మీదకు పిలవడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా, సిద్దిపేటలో సమావేశం పెట్టడం విడ్డూరమన్నారు. 

Arrangements For Sri Komaravelli Mallikarjuna Swamy Fair : కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజీ మీదకు పిలవడం చాలా దురదృష్టకరమన్నారు. శ్రీ మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశం హోటల్​లలో పెట్టలేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెళ్లిపోమ్మనడం విడ్డూరంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.