భారీ స్థాయిలో పునీత్​ ఆఖరి చిత్రం రిలీజ్​ థియేటర్లలో బారులు తీరిన అభిమానులు

By

Published : Oct 28, 2022, 11:15 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

కన్నడ దివంగత స్టార్​ హీరో పునీత్​ రాజ్​కుమార్​ ఆఖరి చిత్రం 'గంధద గుడి' శుక్రవారం ప్రేక్షకలు ముందుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ కర్ణాటకలోని 225కి పైగా థియేటర్లలో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీని చూసి అభిమానులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఎమోషనల్ అవుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరారు. అప్పును వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అన్ని థియేటర్ల ముందు పునీత్​ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. పునీత్​ కటౌట్లకు ఫ్యాన్స్​ పాలాభిషేకం చేశారు. అయితే 'గంధద గుడి' డాక్యుమెంటరీకి అమోఘవర్ష దర్శకత్వం వహించారు. దీనిని పునీత్ రాజ్‌కుమార్‌కు చెందిన పీఆర్‌కే ప్రొడక్షన్స్ నిర్మించింది. కర్ణాటకలోని ప్రకృతి అందాలు, వన్యప్రాణులు, అటవీ ప్రజల జీవనాన్ని డాక్యుమెంటరీలో చక్కగా చూపించారు. అప్పు చేసిన ఈ అరుదైన ప్రయత్నాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించారు. 2021లో 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో పునీత్​ రాజ్​కుమార్​ మరణించారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.