'కల్యాణ్​రామ్​కు అప్పుడు తీవ్ర అనారోగ్యం.. 4 నెలలు బెడ్​పైనే.. ఆమె వల్లే ఇప్పుడిలా..'

By

Published : Feb 12, 2023, 5:57 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

'అమిగోస్​' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్​ హీరో నందమూరి కల్యాణ్​రామ్​.. బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ప్రముఖ యాంకర్ సుమ​ హోస్ట్​గా ఈటీవీలో ప్రసారమవుతున్న 'సుమ అడ్డా' టాక్​ షోకు గెస్ట్​గా వచ్చారు. కల్యాణ్​రామ్​తో పాటు హీరోయిన్ ఆషికా రంగనాథ్​, నటుడు బ్రహ్మాజీ, అమిగోస్​ దర్శకుడు రాజేంద్ర రెడ్డి వచ్చారు. సుమతో సరదాగా ముచ్చటించారు. బ్రహ్మాజీ పలు సందర్భాల్లో నవ్వులు పూయించారు. అషికా కూడా తన గురించి, సినిమా అనుభవాల గురించి పలు విషయాలు షేర్​ చేసుకున్నారు. ఇక, కల్యాణ్​రామ్​​.. సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన​ సమాధానాలు చెప్పారు. సంభాషణ మధ్యలో సుమ ఓ ఫొటో చూపించి.. అందులో కల్యాణ్​రామ్​ చేతికి ఉన్న పచ్చ బొట్టు గురించి అడిగారు. దీనికి కల్యాణ్​రామ్ తన జీవితంలో జరిగిన ఓ ఎమోషనల్​ సంఘటనను పంచుకున్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు.. దీంతో నాలుగు నెలల పాటు బెడ్​పైనే ఉన్నానని చెప్పారు. అప్పుడు ఆమె వల్లే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు తెలిపారు. ఆమె ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మరి.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.