సీసీటీవీ​ వీడియో: గ్రామ సింహంపై చిరుతపులి దాడి

By

Published : Oct 17, 2020, 5:23 PM IST

thumbnail

ఆకలితో ఉన్న చిరుతపులి ఓ కుక్కకు రోదన మిగిల్చింది. అప్పటివరకు పక్కనే పడుకున్న కుక్క పిల్లలను చిరుత చాకచక్యంగా వేటాడేసింది. కర్ణాటకలోని కార్వార్ సమీపంలోని బ్యకోల ఇండియన్ ఆయిల్ బంకు దగ్గర ఈ ఘటన జరిగింది. నిద్రిస్తున్న తల్లి కుక్క గొంతుకను చిరుత పట్టుకొనే ప్రయత్నం చేయగా.. వెంటనే మేల్కొని దాడి నుంచి తప్పించుకుంది. అయితే తల్లిని పట్టుకోవడంలో విఫలమైన చిరుతపులి.. మరోవైపు నుంచి వచ్చి పిల్లలను ఎత్తుకెళ్లిపోయింది. ఫలితంగా ఈ పోరాటంలో గ్రామ సింహం తన ప్రాణాలు కాపాడుకున్నా.. పిల్లల్ని మాత్రం పోగొట్టుకుంది. దీనికి సంబంధించిన చిత్రాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.