సైకత శిల్పంతో ఉత్తరాఖండ్​ బాధితుల కోసం ప్రార్థన

By

Published : Feb 8, 2021, 6:41 AM IST

thumbnail

ఉత్తరాఖండ్​లో సంభవించిన ఆకస్మిక వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. " ప్రే ఫర్ ఉత్తరాఖండ్ "​ అనే పదాలతో మంచు కొండల నమూనాతో సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరి బీచ్​లో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. ఉత్తరాఖండ్ లోని రిషి గంగా, ధౌలి గంగా నదులకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న ఓ జల విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రాజెక్టుల్లో పని చేస్తోన్న 170 మంది కార్మికులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.