కర్ణాటకలో 'లగ్జరీ' కార్ల రై..రై..!

By

Published : Feb 18, 2020, 6:38 AM IST

Updated : Mar 1, 2020, 4:42 PM IST

thumbnail

జాగ్వార్​, లంబోర్గిని, పోర్షే, బెంజ్​, బీఎమ్​డబ్ల్యూ, రేంజ్​ రోవర్​.. కుర్రకారు మతిపోగొట్టే లగ్జరీ కార్లు ఇవి. మన దేశంలో వీటిని చూడటం చాలా తక్కువ. సినిమాల్లో చూసి ఆనందించాల్సిందే. అలాంటిది దాదాపు 20 లగ్జరీ వాహనాలు ఒక్కసారి రోడ్డుపైకి వస్తే? కర్ణాటకలోని చిక్​మంగళూరులో ఇదే జరిగింది. రై..రై మంటూ రోడ్డుపై దూసుకుపోయాయి. వీటిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ లగ్జరీ కార్లను వారి నుంచి రక్షించడానికి పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

Last Updated : Mar 1, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.