లైవ్​ వీడియో: ఒకేసారి నాలుగు బైక్​లు ఢీ

By

Published : Jul 21, 2020, 1:11 PM IST

thumbnail

నాలుగు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన కర్ణాటక కొప్పల్ ప్రాంతంలో జరిగింది. ముందు బైక్​ మీద వెళ్తున్న వ్యక్తి తన బండిని ఎడమ వైపునకు తిప్పాడు. వెనుక మరో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తి.. వాళ్లకు తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ.. ప్రమాదవశాత్తు రెండు బైక్​లు అదుపుతప్పి కిందపడ్డాయి. వారి వెనుకే వచ్చిన మరో రెండు ద్విచక్ర వాహనాలూ స్కిడ్​ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఈ దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.