గ్రామాల్లోకి మొసళ్లు- ఇంటి పైకప్పుపై ఎక్కి...

By

Published : Jul 28, 2021, 12:17 PM IST

thumbnail

మహారాష్ట్రలో భారీ వరదల కారణంగా మొసళ్లు జనావాసాల్లోకి వచ్చాయి. సాంగ్లీ జిల్లాలోని హరిపుర్ ప్రాంతంలో ఓ మొసలి.. ఇంటిపైకప్పుపై సేదతీరుతూ కనిపించింది. కాసేపటికి మళ్లీ నదిలోకి వెళ్లిపోయింది. సాంగ్లీ జిల్లాలోని కృష్ణా బేసిన్ పరిధిలో దాదాపు 50 మొసళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నది వెంబడి 60-70 కి.మీ మేర ఉన్న 15 గ్రామాల్లోకి వరదల సమయంలో అవి ఇలా వస్తుంటాయని చెప్పారు. ఇలా వరదలో కొట్టుకొచ్చిన మొసళ్లతో మనుషులు ముప్పు లేకుండా చూసేందుకు, వాటిని పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.