ETV Bharat / sukhibhava

దంతాలు ఆరోగ్యంగా ఉండి తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫుడ్స్​తో రిజల్ట్​ పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 7:24 AM IST

Superfoods for Shiny and Healthy Teeth: మన దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఎందుకంటే మనం ఏ ఆహారం తినాలన్నా.. అది నోటి నుంచే లోపలికి వెళ్తుంది కాబట్టి. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే పళ్లు, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి. అదే విధంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన పళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాలలాగా మెరుస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Superfoods for Shiny and Healthy Teeth
Superfoods for Shiny and Healthy Teeth

Superfoods for Shiny and Healthy Teeth: ముఖం, జుట్టు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన మనం.. నోటి ఆరోగ్యం మీద అంతగా దృష్టి పెట్టం. పంటి నొప్పి సమస్యలు తలెత్తితే గానీ దాని ప్రాధాన్యమేంటో అర్థం కాదు. ఇక చాలా మంది ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకోవటంతోనే సరిపుచ్చుతుంటారు. ఏదో మొక్కుబడికి శుభ్రం చేసుకునేవారు కూడా చాలా మందే. నిజానికి రాత్రి పడుకోబోయే ముందూ బ్రష్‌తో పళ్లు తోముకోవటం తప్పనిసరి. ఎందుకంటే నోరు సరిగా క్లీన్​ చేసుకోకపోతే.. దుర్వాసన వస్తూ ఉంటుంది. దీంతో మీ పక్క కూర్చోవడానికి.. మీతో మాట్లాడడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే పళ్ల ఆరోగ్యం మీదే శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల మన దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దంతాలు తళతళా మెరిసిపోతూ, ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం బ్రష్ చేసుకోవడం మాత్రమే కాదు.. మనం తీసుకునే ఆహారం పాత్ర కూడా చాలానే ఉంటుందంటున్నారు నిపుణులు. మరి ఆ ఆహార పదార్థాలేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

దంతాలు విరిగిపోతున్నాయా? ప్రధాన కారణాలు ఇవేనట!

వాటర్​: నీరు ఎక్కువగా తాగితే.. పళ్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఫుడ్​ను తొలగించి నోటిలో లాలాజలం స్థాయుల్ని పెంచుతుంది. లాలాజలంలో ఉండే నీరు, ప్రొటీన్లు, మినరల్స్ మొదలైనవి దంతాల్లో ఏవైనా సమస్యలుంటే తొలగించి దంతాల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. పళ్లకు మెరుపును అందిస్తాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే.. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా బాడీ హైడ్రేటెడ్​గా ఉండటానికి, దంత క్షయాలను నివారించడానికి ఒక వ్యక్తి ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు.

ఆకు కూరలు: ఆకుకూరల్లో ఉండే పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బచ్చలికూర, కాలే, పాలకూర వంటి ఆకుకూరలు, క్యారెట్, సెలెరీ వంటి రూట్ వెజిటేబుల్స్​లో ఫోలిక్ యాసిడ్‌ అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్ బి చిగుళ్ల వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

How To Avoid Teeth Stains : మీ దంతాలు పాలలా తెల్లగా మెరవాలా? ఈ చిట్కాలు మీకోసమే!

పండ్లు: NCBI నివేదిక ప్రకారం.. యాపిల్ తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. యాపిల్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇది టూత్‌ బ్రష్‌గా పని చేస్తుంది. దంతాల నుంచి ఫలకాన్ని తొలగిస్తుంది. యాపిల్‌లో ఉండే యాసిడిక్‌ గుణం నోటి దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి.. పళ్లపై పేరుకున్న పాచిని తొలగిస్తాయి.

పొట్టలో ఇబ్బందులా? - మీ దంతాలే కారణం కావొచ్చని తెలుసా!

స్ట్రాబెర్రీల్లో మాలిక్ యాసిడ్‌ అధికంగా ఉంటుందని NIH(National Institute of Health) నిర్వహించిన అధ్యయనంలో కనుగొన్నారు. మాలిక్‌ యాసిడ్‌ను టూత్‌ పేస్ట్‌ తయారీలోనూ వాడతారు. ఇది న్యాచురల్‌ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది. దంతాల మూలల్లో ఫలకాన్ని తొలగిస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ దంతాలను తెలుపు రంగులోకి మారుస్తుంది. అలాగే జామ, ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే చిగుళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

గింజలు: బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్ వంటి గింజలు సూక్ష్మ పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులో అర్జినైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే చిగుళ్ల వ్యాధుల నివారణకు లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది.

మీ పిల్లలు రోజూ బ్రష్ చేస్తున్నారు కరక్టే - ఇలా చేస్తున్నారా? - లేదంటే పుచ్చిపోవడం ఖాయం!

సీఫుడ్: పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సీఫుడ్​ బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది చిగుళ్ల వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్​టీలో పాలీఫెనాల్స్, కాటెచిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఈ టీ.. పీరియాంటల్ వ్యాధుల ప్రమాదాన్ని అరికట్టడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గ్రీన్ టీ ఫ్లోరైడ్ అదనపు మూలంగా కూడా పనిచేస్తుంది. అలాగే నోటి దుర్వాసనను నివారిస్తుంది.

Coconut Health Benefits In Telugu : అధిక బరువు, జుట్టు సమస్యలకు కొబ్బరితో చెక్​!

చిక్కుళ్లు: చిక్కుళ్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. చిక్‌పీస్, నల్ల మినుములు, నల్ల చన్నా మొదలైన వాటిలో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎనామిల్‌ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అలాగే దంత క్షయం అవకాశాలను మరింత తగ్గిస్తాయి.

పాలు పదార్థాలు: పాలు, చీజ్ రెండింటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉండటం వల్ల కేవలం ఎముకలే కాకుండా.. దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు, చీజ్‌లో కాసైన్ అనే ప్రోటీన్‌‌ కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్‌ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే.. యాసిడ్స్‌ న్యూట్రల్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల నోటి దుర్వాసనను తగ్గిస్తుంది, దంతాల పసుపు రంగును నివారిస్తుంది.

పళ్లు జివ్వుమని ఎందుకు లాగుతాయి? దానికి పరిష్కారం ఏంటి?

ఎన్ని నెలలకు బ్రష్ మార్చాలి?.. ఎంతసేపు పళ్లు తోముకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.