ETV Bharat / sukhibhava

Rash On Neck From Gold Necklace : మెడపై రాషెస్​కు బంగారం ధరించడమే కారణమా?.. మరి తగ్గించుకోవడం ఎలా?

author img

By

Published : Aug 11, 2023, 7:51 PM IST

Rash On Neck From Gold Necklace : మెడపై దద్దుర్ల సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇవి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటి గురించి ఇందులో తెలుసుకుందాం..

Rash On Neck From Gold Necklace
మెడపై దద్దుర్లకు కారణాలు, చిట్కాలు

Rash On Neck From Gold Necklace : మెడపై దద్దుర్లు వస్తున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం అనేక క్రీములను వాడుతూ ఉంటారు. అయినా ఎలాంటి లాభం ఉండకపోవడం వల్ల తగ్గించుకోవడం తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. ఎన్ని క్రీములు వాడినా సరే దద్దుర్లు అనేవి పోవు. మెడపై దద్దుర్లు ఏర్పడటం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా బయటకు కనిపించడం వల్ల అందవికారంగా కనిపిస్తుంది.

మెడపై దద్దుర్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంశపార్యపరంగా కూడా ఈ దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఊబకాయం, శరీరంపై ఎండ ఎక్కువగా పడటం, చెమట, ఫంగస్ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా మెడపై దద్దుర్లు రావడానికి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. మెడపై దద్దుర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారు ఆభరణాలు వేసుకుంటున్నారా?
Skin Irritation On Neck From Necklace : సాధారణంగా మెడపై దద్దుర్లు ఆడవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఆడవాళ్లు మెడలో బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. అయితే అలా బంగారం వేసుకున్నప్పుడు మెడ వెనుక చర్మంపై అలర్జీ వల్ల దద్దుర్లు ఏర్పడతాయి.

చర్మం నల్లగా మారుతుందా?
Rashes Side Effects : మెడపై దద్దుర్లు రావడం వల్ల అక్కడ చర్మం నల్లగా మారిపోయి దురదగా అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల చర్మం మందంగా తయారవ్వడం వల్ల చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది మెడికల్ షాపుకు వెళ్లి క్రీములు తెచ్చుకొని రాసుకుంటూ ఉంటారు. కానీ దాని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. దద్దుర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, ముందు వాటిని అదుపులో పెట్టుకోవడం వల్ల దద్దుర్లను సులువుగా నివారించుకోవచ్చని చెబుతున్నారు.

ఊబకాయం వల్ల దద్దుర్లు..
Skin Rashes Obesity : చాలామంది అధిక బరువు కలిగి ఉండి ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి మెడపై దద్దుర్లు వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో క్రీములు వాడటం వల్ల మాత్రమే తగ్గించుకునే అవకాశం ఉండదు. క్రీములు వాడుతూనే ఇలాంటివారు వ్యాయామాలు, ఆహార నియామాలు పాటించి బరువు తగ్గించుకోవడం వల్ల దద్దుర్ల సమస్య నుంచి బయటపడవచ్చు.

చెమట వల్ల కూడా..
Sweat Rashes On Neck : అధిక చెమట వల్ల కూడా మెడపై దద్దుర్లు వచ్చే ప్రమాదముంటుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో చెమటలు ఎక్కువగా పడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇలాంటప్పుడు చర్మంపై దురద ఏర్పడి దద్దుర్లు అనేవి ఏర్పడతాయి. ఇలాంటివారు వాతావరణంలోని మార్పులను గమనించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యాంటీఫంగల్ క్రీములు, పౌడర్లు లాంటివి వాడుతూ చెమటను తగ్గించుకోవాలి. దీని వల్ల దద్దుర్లను వీలైనంత త్వరగా నివారించుకోవచ్చు.

శరీరంపై ఎండ పడకుండా..
శరీరంపై ఎక్కువసేపు ఎండ పడటం వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశముంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో సన్‌స్క్రీన్ క్రీములు, లోషన్లు లాంటివి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ చర్మానికి సరిపోయే క్రీములను వాడాలని సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ క్రీములు రాసుకోవడం వల్ల ఎండ బారి నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. ఇక వాతావరణాన్ని తగ్గట్లు చర్మాన్ని సంరక్షించుకోవాలి.

జుట్టు రాలుతున్న ఆడవారికి చిట్కా:
Hair Fall Tips : చాలామంది ఆడవారిలో రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోవడం మనం తరుచూ చూస్తుంటాం. హార్మోన్ల ప్రభావం, పోషక ఆహార లోపం లాంటి వాటితో పాటు మారిన జీవన విధానాలు ఇందుకు కారణం కావచ్చు. అయితే జుట్టు రాలిపోవడాన్ని అరికట్టాలంటే హెయిర్ స్ట్రెయిటనింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలని డెర్మటాలజిస్టులు సలహా ఇస్తున్నారు. తగిన పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు కాలుష్యం బారి నుంచి జుట్టును సంరక్షించుకోవాలి. అలాగే జుట్టుకు మంచి కొబ్బరినూనె వాడటం వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్‎ఫెక్షన్లు చాలా వరకు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

మెడపై దద్దుర్లకు కారణాలు, చిట్కాలు

మాయిశ్చరైజర్​తో చర్మం జిడ్డుగా మారుతోందా?.. ఈ నిపుణుల సలహాలు మీకోసమే!

Anemia Hair Fall: ఇవి పాటిస్తే మీ జుట్టు రాలదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.