ETV Bharat / sukhibhava

healthy food: ఇలా చేస్తే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు చెక్​!

author img

By

Published : Aug 26, 2021, 9:22 AM IST

Updated : Aug 26, 2021, 10:15 AM IST

rainy season healthy food
హెల్త్ టిప్స్

అసలే వర్షాకాలం.. ఓ వైపు వైరస్​లు, మరో వైపు కాలుష్యం. దాంతో సాధారణ జ్వరాల దగ్గర్నుంచీ కామెర్లు, బ్రోంకైటిస్‌ వరకూ అనారోగ్యాల బారినుంచి కుటుంబాన్ని రక్షించుకోవడం ఇల్లాలికి సవాలే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలను అధిగమించొచ్చు.

వైరస్‌లు, బ్యాక్టీరియా విజృంభించే కాలమిది. దాంతో జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు ఇట్టే వచ్చేస్తాయి. వాటిని తిప్పికొట్టాలంటే మొట్టమొదట చేయాల్సింది రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. అందుకు ఇంటిల్లిపాదీ విటమిన్‌ సి విస్తారంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే సగం రోగాలను నివారించినట్లే. మొలకెత్తిన గింజలు, తాజా ఆకుకూరలు కూడా అంతే ఫలితాన్నిస్తాయి.

* యాపిల్‌, నేరేడు, బొప్పాయి, దానిమ్మ లాంటి పండ్లు రోగ నిరోధకతను పెంచుతాయి.

* వర్షం మనకు తెలీకుండానే సోమరితనాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజుకు వ్యాయామాన్ని వాయిదా వేద్దాం లెమ్మనిపిస్తుంది. కానీ అస్సలు నిర్లక్ష్యం చేయడానికి లేదు. బద్ధకాన్ని జయించి కాసేపు ఎక్సర్‌సైజ్‌ చేస్తే కండరాలు చురుగ్గా పనిచేస్తాయి, రక్తప్రసరణ బాగుంటుంది.

* నీటి కాలుష్యం వల్ల కామెర్లు వచ్చే ప్రమాదముంది. కనుక ఈ కాలంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగడం అలవాటుచేయాలి.

* పిల్లలు ఇంటి వంటల కంటే స్ట్రీట్‌ ఫుడ్డే ఇష్టపడతారు. కానీ దుమ్మూధూళీ చేరి, ఈగలు ముసిరే వాటిని తినడం వల్ల ఎన్ని అనర్థాలో నచ్చచెప్పాలి.

* స్నానం నీళ్లలో డిసిన్‌ఫెక్టెంట్‌ కలపడం వల్ల కంటికి కనిపించని క్రిముల బారి నుంచి రక్షణ లభిస్తుంది.

* మెంతి, కాకర, వెల్లుల్లి తినడంవల్ల వైరల్‌ ఫీవర్లు రావు.

* ఈ కాలంలో పండ్లు, కూరగాయలను ఉప్పునీళ్లతో కడగటం శ్రేష్ఠం.

* చల్లటి పదార్థాలు, పానీయాల వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశముంది. ఈ సీజన్‌లో ఏవైనా వెచ్చగా తినడం మంచిది.

ఇవీ చదవండి:

Last Updated :Aug 26, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.