ETV Bharat / sukhibhava

జుట్టు రాలిపోతోందా? కారణాలు అవే కావొచ్చు.. ఇలా చేస్తే సెట్!

author img

By

Published : Jul 14, 2022, 11:14 AM IST

hair fall prevention remedies: పాతికేళ్లకే బట్టతల... నడి వయసు రాకముందే వృద్ధాప్య ఛాయలు.. ఫలితంగా యువతకు పెళ్లి సమస్యలు.. మానసిక కుంగుబాటు! జుట్టు రాలడం ఇన్ని దుష్పరిణామాలకు దారితీస్తోంది. మరి ఈ సమస్యను అధిగమించేది ఎలా?

HAIR FALL PREVENTION
HAIR FALL PREVENTION

hair fall control: నడి వయసు రాలేదు.. అప్పుడే తలపై జుట్టు పలచపడిపోతోంది. ఎందుకో తెలుసా.. జీవన శైలిలో మార్పు, ఆహార అసమతుల్యం, మానసిక ఒత్తిడి జుట్టు రాలిపోయేలా చేస్తున్నాయి. పాతికేళ్లకే బట్టతల వచ్చేస్తోంది. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితితో చదువుపై శ్రద్ధ లేకపోవడం, పెళ్లికి అమ్మాయి ఇష్టపడకపోవడంతో మానసికంగా కుంగిపోతున్న యువత ఎక్కువ మందే కనిపిస్తుంటారు. ఈ పరిస్థితి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? బట్టతల వస్తే ఎలా..? లాంటి ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారంటే...

శిరోజాలు ఎందుకు ఊడుతున్నాయి..
సాధారణంగా పురుషులకు లక్ష, మహిళలకు లక్షన్నర శిరోజాలుంటాయి. జుట్టు పెరిగే దశ, విశ్రాంతి దశ, రాలిపోయే దశలంటూ ఉంటాయి. రోజూ వంద వెంట్రుకల దాకా రాలిపోతాయి. ఇలా వెంట్రుకలు రాలిపోకుండా ఉంటే వాటిని పెంచడం కష్టంగా ఉంటుంది. వాటి పోషణ కూడా చేయలేం. తల దువ్వినా, స్నానం చేసినా, పడుకున్నా ఊడిపోతే సమస్యగా చెప్పవచ్చు. అప్పుడే వైద్యులను కలుసుకోవాలి.

కారణాలు ఇవేనా

  • మానసిక ఒత్తిడి, బీ 12, ఐరన్‌ లోపం, జెనటిక్‌ సమస్య. తండ్రి నుంచి 78 శాతం మాత్రమే బట్టతల వారసత్వంగా వస్తుంది. మిగిలిన 22 శాతం తాత, ముత్తాత నుంచి వచ్చే అవకాశం ఉంటుంది.
  • హెయిర్‌డైలో రసాయనం ఎక్కువగా ఉన్న వాటిని వాడటంతో జుట్టు రాలిపోతుంది. జుట్టుకు రంగులు వేయడం, వీవింగ్‌ చేయడంతో కూడా సమస్య వస్తుంది.
  • కొవిడ్‌ వ్యాక్సిన్‌తో కూడా జుట్టు రాలిపోతుంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు, గర్భిణులకు మానసిక ఒత్తిడితో జుట్టు పోతుంది.
  • వయసు ఆధారంగా బట్టతల వస్తుంది. దాన్ని మందులు, ఆయిల్స్‌తో ఆపలేం.
  • ప్రాంతాలు మారినప్పుడు నీరు మారుతుంది. దాంతో కూడా జుట్టు రాలుతుంది. నిద్రలేమి, షాంపూలు తరచూ మార్చడం సరికాదు.

ఇలా చేసి చూడండి

  • జుట్టు రాలకుండా ఉంచేందుకు మందులు కొన్నే ఉంటాయి. వాటిని వైద్యుల సూచన మేరకు వాడుకోవాలి. ఆహారం, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా వినియోగించాలి.
  • ఉప్పునీరు వాడొద్దు. బట్టల సబ్బు వద్దు. బాగా నురుగు రాకుండా ఉండే షాంపూలు వాడాలి. పొగతాగేవారికి తొందరగా బట్టతల వస్తుంది.
  • బట్టతల వస్తే హెయిర్‌ ట్రాన్స్​ప్లాంటేషన్‌ చాలా వరకు పరిష్కారం చూపిస్తుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.