ETV Bharat / sukhibhava

How to Remove Pesticides from Fruits : పండ్లు, కూరగాయలపై ఉన్న పురుగు మందులు ఇలా తొలగించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 3:44 PM IST

Best Method to Remove Pesticides from Fruits : పురుగు మందులు చల్లకుండా.. పండ్లు, కూరగాయలు పండించడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఇలాంటి వాటిని తింటే అనారోగ్యం ఖాయమవుతోంది. అయితే.. మేము చెప్పే పద్ధతిలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేస్తే.. పురుగుమందులను పూర్తిగా వదిలించుకోవచ్చు..!

Best Method to Remove Pesticides from Fruits
How to Remove Pesticides from Fruits

How to Remove Pesticides from Fruits in Telugu : ఈ కాలంలో ఎవరి ఆరోగ్యానికి వారే రక్ష. ఎవరో వచ్చి, ఏదో చేస్తారంటే అది భ్రమే! కాబట్టి.. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది మన జీవనశైలి. మంచి ఆహారం, బరువు అదుపు, వ్యాయామం(Exercise) లాంటివి మన హెల్త్​ను ఫిట్ గా ఉంచుతాయి. వాటిలో ప్రధానంగా మనం మంచి ఆహారం గురించి చెప్పుకోవాలి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంలో తాజా పండ్లు(Fruits), కూరగాయలు ప్రధాన భూమిక పోషిస్తాయనడంలో సందేహం లేదు.

How to Remove Pesticides from Vegetables : కానీ.. వ్యవసాయంలో వినూత్న మార్పులు వచ్చేశాయి. కృత్రిమ రసాయనాల వాడకం అధికమైంది. ఏ పంట చూసినా ఎరువులతోనే పెరిగే పరిస్థితి నెలకొంది. దీంతో.. పండ్లు, కూరగాయలలో విపరీతమైన రనాయనాలు ఉంటున్నాయి. ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు కొనాలంటే.. అధిక ఖర్చు. దీంతో.. చాలామంది.. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలే తినేస్తున్నారు. అయితే.. వాటిపై ఉండే రసాయన అవశేషాలు అలాగే ఉండిపోతున్నాయి.

Avoid These Habits After Meal : తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..!

ఇలాంటివి తినడం వల్ల.. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, హార్మోన్ల సమస్యలు, చర్మ, జుట్టు రాలే సమస్యల బారిన పడుతుంటారు. ఇంకా అవి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. మెదడు, కిడ్నీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం మెండుగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఈ సమస్యకు ఇక్కడ ఓ పరిష్కారం చూపిస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా బయట దొరికే పండ్లు, కూరగాయల(Vegetables)ను ఎలాంటి రసాయనాలు, క్రిమికీటకాలు లేకుండా పరిశుభ్రంగా మార్చుకుని తినొచ్చు.

How to Remove Pesticides from Fruits and Vegetables in Telugu :

పండ్లు, కూరగాయల నుంచి సింపుల్​గా రసాయనాలను తొలగించుకునే విధానం..

  • మొదట మీరు మార్కెట్​ నుంచి తెచ్చుకున్న కూరగాయలు, పండ్లను ఒక పాత్రలో తీసుకోవాలి.
  • ఆ తర్వాత అవి మునిగే వరకు దాంట్లో వాటర్ నింపాలి. అలా కొద్దిసేపు ఉంచాక ఆ పాత్రలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కలపాలి.
  • అలా బేకింగ్ సోడా(సోడియం బై కార్బొనేట్) కలిపిన పాత్రలో కూరగాయలు, పండ్లను 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి.
  • ఇలా ఉంచిన తర్వాత వాటిని బయటకు తీసి ట్యాప్ కింద శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని ఏదైనా క్లాత్​తో తుడవాలి.
  • ఇంతే.. ఇలా చేయడం వల్ల వాటిపై ఉన్న పెస్టిసైడ్స్ తొలగిపోతాయి.
  • కాస్త సమయం పట్టినా.. చాలా తక్కువ ఖర్చుతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సో.. ఇక నుంచి మీరు కూడా ట్రై చేయండి.

Jaggery Health Benefits in Telugu : బెల్లాన్ని వీటితో కలిపి తింటే ఎన్ని లాభాలో..!

Sweet Corn Health Benefits : స్వీట్​కార్న్​తో బోలెడు ప్రయోజనాలు.. జీర్ణ సమస్యలు మటుమాయం!.. డయాబెటిస్​ దూరం!

High Protein Diet Health Benefits : హై ప్రోటీన్ ఫుడ్​తో.. స్థూలకాయం సహా.. బీపీ, షుగర్​లకు చెక్​!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.