ETV Bharat / sukhibhava

మెడపై రాషెస్ రావటానికి 'గోల్డ్' చైనే కారణమా?

author img

By

Published : Jan 15, 2023, 7:25 AM IST

చలికాలంలో చర్మ సంబంధిత వ్యాధులతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమందిని మెడపై రాషెస్, దురద వంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతూ ఉంటాయి. అయితే.. మెడపై రాషెస్ రావటానికి కారణాలేంటి? పరిష్కార మార్గాలేంటి?

Does Gold Chain Causes Skin Darkening On Neck
మెడపై రాషెస్ రావటానికి బంగారమే కారణమా?

మెడపై రాషెస్ రావటానికి బంగారమే కారణమా?

శీతాకాలంలో ఎక్కువగా చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. వీటి వల్ల చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమందిలో అయితే మెడపై రాషెస్ వస్తాయి. మెడపై బంగారం లేదా మరేవైనా ఆభరణాలను వేసుకోవటం వలనే రాషెస్ వస్తున్నాయి అనుకుంటారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయంపై నిపుణులు స్పష్టత ఇచ్చారు. మెడపై రాషెస్ రావటానికి గల కారణాలను, సమస్య పరిష్కార మార్గాలను కూడా తెలిపారు. అవేంటంటే..

మెడపై రాషెస్ రావటానికి గల కారణాలు:

  • సాధారణంగా మెడపై ఎక్కువ చెమట పట్టడం వల్ల రాషెస్ వస్తాయి.
  • ఎండ కారణంగా కూడా మెడ చర్మంపై దద్దుర్లు వస్తాయి.
  • అయితే మెడలో వేసుకున్న గోల్డ్ చైన్ మందంగా ఉంటే చెమట ఎక్కువగా పట్టడం వల్ల రేషెస్ మరింత ఎక్కువవుతాయి.
  • మెడపై ఎక్కువగా ఎండ తగలడం వలన స్కిన్​పై దద్దుర్లు వస్తాయి.
  • మెడపై మందంగా ఉన్న ఆభరణాలను ఎక్కువగా వేసుకోవటం వల్ల రాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • ఒకవేళ మెడపై దురద ఉంటే అది ఇన్​ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు.
  • ఫంగల్ ఇన్​ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
  • కొన్ని రకాల కీటకాలు మెడపై కుట్టటం వల్ల రాషెస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
  • శరీరానికి పడని ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా మెడ​పై రాషెస్ రావచ్చు.
  • కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా మెడపై రాషెస్ రావచ్చు. వాడిన మందులు దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
  • అధిక వేడిమి వల్ల కూడా మెడపై దద్దుర్లు వస్తాయి.
  • ఈ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డెర్మటాలజిస్టును సంప్రదించటం ఉత్తమం.

సమస్య పరిష్కార మార్గాలు:

  • మెడపై రాషెస్ రావటానికి గల కారణాలేంటో చర్మ వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి.
  • తెలిసీ తెలియని వైద్యం చేయటం మానేసి దద్దుర్లకు డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకోవటం ఉత్తమం.
  • మెడపై ఎక్కువగా ఎండ తగలకుండా చూసుకోవాలి.
  • ఒకవేళ ఎండలోకి వెళ్లాల్సివస్తే మెడపై సన్​స్క్రీన్​ను అప్లై చేసుకోవాలి.
  • మరీ మందంగా ఉన్న ఆభరణాలను ధరించటం మంచిది కాదు.
  • మెడపై రాషెస్ వస్తున్నప్పుడు ఎక్కువగా గోక్కోవటం మంచిది కాదు. దీనివల్ల దద్దుర్లు మరింత ఎక్కవవుతాయి.
  • సమస్య మరింత ఎక్కువవ్వక ముందే డాక్టర్​ను సంప్రదించటం ఉత్తమం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.