ETV Bharat / sukhibhava

ఎలాంటి మందులూ వాడకుండానే - హైబీపీ తగ్గించుకోండిలా!

Best Ways to Reduce High Blood Pressure : ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య.. హైబీపీ. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది నిత్యం మందులు వాడుతుంటారు. అయితే.. ఎలాంటి మందులూ వాడకుండానే ఈజీగా నయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు! అదెలాగో చూడండి.

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 5:10 PM IST

High Blood Pressure
High Blood Pressure

Best Tips For Reduce High Blood Pressure : నేటి స్మార్ట్​ యుగంలో ప్రతి ఒక్కరీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా వరకు మారాయి. ఈ క్రమంలో చాలా మందిని పని ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో.. వయసుతో సంబంధం లేకుండా జనం ఎదుర్కొంటున్న సమస్య.. అధిక రక్తపోటు(హైబీపీ). ఇది సాధారణ ఆరోగ్య సమస్యగా కనిపించినప్పటికీ.. అలా వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం! మరి.. దీన్ని నేచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

ఈ ఆహారాలు తీసుకోండి : హైపర్‌ టెన్షన్‌ను నియంత్రించడంలో మీ ఆహారం చాలా కీలకం. రోజువారి డైట్​లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్‌లను ఉండేలా చూసుకోవాలి. ఇవి బాడీలో సోడియం లెవల్స్​ పెరగకుండా ​లిమిట్స్​లో ఉంచుతాయి. ఈ విధంగా ఆహారం తీసుకోవడం ద్వారా.. కాలక్రమేణా రక్తపోటును తగ్గించుకోవచ్చు.

ఉప్పును తగ్గించండి : మీరు హైబీపీ నుంచి బయటపడాలంటే ప్రధానంగా చేయాల్సింది నిత్యం తినే కర్రీస్, ఆహార పదార్థాలలో ఉప్పును తగ్గించాలి. ఎందుకంటే సాల్ట్​లో అధిక స్థాయిలో సోడియం ఉంటుంది. అది రక్తపోటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎక్కువ మొత్తంలో సోడియం కలిగి ఉండే ప్రాసెస్ చేసే రెస్టారెంట్ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండండి.

పొటాషియం అధికంగా ఉండేవి : అరటిపండ్లు, చిలగడదుంపలు, ఆకు కూరలు వంటి వాటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా సోడియం కలిగించే ప్రభావాలను ఎదుర్కొనడమే కాకుండా రక్తపోటును తగ్గిస్తాయి.

మెగ్నీషియం, కాల్షియం ఉండేవి : ఆహారంలో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండే బాదం, పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఖనిజాలు రక్తపోటు నియంత్రణలో చాలా బాగా ఉపయోగపడతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం : మీరు డైలీ వ్యాయామం చేయడం ద్వారా గుండె బలోపేతం అవ్వడంతో పాటు రక్తనాళాల పనితీరు చాలా మెరుగవుతుంది. వీటితో పాటు రక్తపోటూ నియంత్రణలో ఉంటుంది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

ఆందోళన, ఒత్తిడి వల్ల బీపీ పెరిగిందా?.. అయితే తగ్గించుకోండిలా!

ఒత్తిడి : ప్రస్తుత రోజుల్లో చాలా మంది దీర్ఘకాలిక ఒత్తిడితో ఇబ్బందిపడుతుంటారు. ముందు ఆ సమస్య నుంచి బయటపడడానికి ట్రై చేయాలి. ఇందుకోసం ధ్యానం, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి వాటిని ప్రాక్ట్రీస్ చేయాలి.

మద్యం తాగకూడదు : ఎలాంటి మందులు లేకుండా హైబీపీని తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని.. మద్యానికి వీలైనంత దూరంగా ఉండడం. ఎందుకంటే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా రక్తపోటు పెరుగుతుంది.

బరువు తగ్గాలి : అధిక బరువు బీపీని పెంచుతుంది. కాబట్టి మీరు లావు తగ్గడం ద్వారా రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తినండి, వ్యాయామం చేయండి.

బీపీని చెక్ చేసుకోవడం : వీటన్నింటిని ఫాలో అవుతూ బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీరు తరచుగా చెక్ చేసుకోవడం ద్వారా మీలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ఈ విధంగా మీరు ఎలాంటి మందులు లేకుండానే హైబీపీ సమస్యను ఈజీగా నయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణులకు హైబీపీ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మధుమేహానికి రక్తపోటు తోడైతే గుండెకు ప్రమాదమా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.