ETV Bharat / sukhibhava

అల్లం టు సోంపు.. బెల్లీఫ్యాట్ త‌గ్గించే 6 ఆయుర్వేద మూలిక‌లు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 6:35 AM IST

Belly Fat Burning Ayurveda
Belly Fat Burning Ayurveda

Belly Fat Burning Ayurveda : ఈ కాలంలో బెల్లీ ఫ్యాట్ బాధితులు ఎక్కువైపోయారు. మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల యువ‌త‌కు సైతం పొట్ట వ‌స్తుంది. అయితే.. ఈ బెల్లీ ఫ్యాట్ త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డే 6 ఆయ‌ర్వేద మూలిక‌ల గురించి తెలుసుకుందాం.

Belly Fat Burning Ayurveda : ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో అనారోగ్యాల బారిన ప‌డే వారి సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవన విధానం, గ‌జిబిజి ఆహార‌పు అలవాట్లకు తోడు శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో చిన్న పెద్దా తేడా లేకుండా బ‌రువు పెరుగుతున్నారు. పెద్ద‌ల‌కేమో ఆఫీసు బిజీ, చిన్నారుల‌కు ఆరుబ‌య‌ట ఆట‌లు లేక ఉబ‌కాయం వ‌స్తుంది. మ‌రోవైపు యువ‌త సైతం బ‌య‌ట హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో ఫుడ్ బాగా తింటున్నారు. అందులో వాడే నూనెల వ‌ల్ల కొవ్వు పెరిగిపోయి పొట్ట వ‌స్తుంది. దాన్ని త‌గ్గించుకోవ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. దీనికోసం జిమ్ కెళ్ల‌డం, ఆన్​లైన్​లో ప్ర‌త్యేకంగా కోచ్​ను పెట్టుకునే వారు కొంద‌రైతే... యూట్యూబ్​లో కొంద‌రి వీడియోలు ఉచితంగా చూసి ప్ర‌య‌త్నాలు చేసే వాళ్లు ఇంకొంద‌రు. ఏదేమైనా వారి ల‌క్ష్యం ఆ పొట్ట‌ను త‌గ్గించ‌డ‌మే. ముఖ్యంగా ఉదరం కింది భాగంలో ఉండే బెల్లీ ఫ్యాట్​ను తగ్గించాలంటే క‌త్తి మీద సాముతో కూడుకున్న ప‌నే. శారీర‌కంగా చాలా శ్ర‌మ ప‌డి చెమ‌టోడ్చాల్సి వ‌స్తుంది. ఇవే కాకుండా.. బెల్లీ ఫ్యాట్‌ను త‌గ్గించేందుకు ప‌లు ఆయుర్వేద మూలిక‌లు ఉన్నాయ‌ని మీకు తెలుసా? అలాంటి 6 మూల‌కాలు, అవి ఎలా ప‌నిచేస్తామో ఈ ఆర్టిక‌ల్​లో తెలుసుకుందాం.

1. అల్లం
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది అల్లం గురించి. దాదాపుగా అంద‌రి ఇంట్లో ఇది ఉంటుంది. రోజూ వంట‌ల్లో, ఇత‌ర ప‌దార్థాల్లోనూ వాడ‌తారు. అయితే.. అల్లాన్ని సాధారణంగా ఆయుర్వేదంలో వివిధ జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచి, జీవక్రియను పెంచుతుందని.. అంతేకాకుండా కొవ్వును క‌రిగించ‌డంలోనూ త‌గిన పాత్ర పోషిస్తుంద‌ని న‌మ్ముతారు.

2. దాల్చిన చెక్క‌
ఇంట్లో ఏదైనా శుభ‌కార్యం జ‌రిగిన‌ప్పుడు చేసే వంట‌కాల్లో త‌ప్ప‌ని స‌రిగా దాల్చిన చెక్క ఉండాల్సిందే. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మ‌న ఎనర్జీ లెవెల్స్​ను స్థిరంగా ఉంచడం ద్వారా ఆక‌లిని తగ్గిస్తుంది. ప‌రోక్షంగా బ‌రువు త‌గ్గ‌డంలో సాయ‌ప‌డుతుంది.

3. గుగ్గుల్‌
గుగ్గుల్‌ను సాధారణంగా ఆయుర్వేదంలో వెయిట్ మేనేజ్​మెంట్​లో ఉప‌యోగిస్తారు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుందని న‌మ్ముతారు. అంతేకాకుండా.. ఫ్యాట్ మెట‌బాలిజాన్ని ప్ర‌మోట్ చేస్తుంద‌ని విశ్వ‌సిస్తారు. ఇందులోని ప‌లు ల‌క్ష‌ణాల్ని బ‌ట్టి దీన్ని.. ప‌లు యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ వ్యాధుల చికిత్స‌లో ఉప‌యోగిస్తారు.

4. ఉసిరి
మ‌న‌కు బాగా సుప‌రిచిత‌మైన పేరిది. విట‌మిన్ సి అధికంగా గ‌ల ఈ పండుని కూడా ఆయుర్వేదంలో ప‌లు ర‌కాల చికిత్స‌ల‌కు వాడ‌తారు. ఇందులో విట‌మిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. తిన‌డం వ‌ల్ల జీర్ణ క్రియ స‌క్ర‌మంగా జ‌రగ‌డమే కాకుండా మెటబాలిజం కూడా పెరుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలోనూ సాయ‌ప‌డుతుంది.

5. ఆమ‌లాకీ, బిబిటాకీ, హరిటాకీ మిశ్రమం
అమలాకి, బిబిటాకి, హరిటాకి మిశ్రమం జీర్ణ క్రియ స‌జావుగా సాగ‌డంలో తోడ్ప‌డుతుంది. ఇది మూడు పండ్ల (త్రిఫ‌ల‌) మిశ్ర‌మం. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మ‌న బాడీని ప్రొటెక్టివ్ ఉంచుతాయి. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల డీటాక్సిఫికేష‌న్, మెటబాలిజం మెరుగుప‌డుతుంది. సమ‌ష్టిగా బరువు తగ్గించే విధానాల్లో దీన్ని ఉప‌యోగిస్తారు.

6. ఫెన్నెల్
ఫెన్నెల్ అనేది క్యారెట్ కుటుంబానికి చెందిన పుష్పించే జాతి మొక్క. ఆయుర్వేదంలో.. జీర్ణక్రియ స‌క్ర‌మంగా సాగ‌డంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. త్రిదోషిక్ మూలికగా, సోపు వాత మరియు కఫాలకు కూడా సమతుల్యం చేస్తుంది. క‌డుపు ఉబ్బ‌రాన్ని, బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.

Belly Fat Effects On Health : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఇలా చేస్తే అంతా సెట్​!

పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతోందా..? ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్​ హాంఫట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.