ETV Bharat / sukhibhava

ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిక బరువు తగ్గట్లేదా? - ఈ 90-30-50 డైట్ ప్లాన్‌తో ఈజీగా చెక్ పెట్టండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 5:21 PM IST

Weight Loss
Weight Loss

90-30-50 Diet Plan : అధిక బరువుతో ఇబ్బంది పడేవారు వెయిట్ లాస్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా జిమ్​లో తీవ్రమైన కసరత్తులు చేస్తుంటారు. తినే తిండిని కూడా తగ్గిస్తుంటారు. ఫలితంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాకాకుండా ఆరోగ్యకరంగా మేము చేప్పే ఈ 90-30-50 డైట్​ ప్లాన్​తో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

90-30-50 Diet Plan For Weight Loss : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, తగిన శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి.. ఇలా అనేక కారణాలతో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని జిమ్​లలో తీవ్రమైన కసరత్తులు చేస్తుంటారు. అలాగే ఏవేవో వెయిట్ లాస్(Weight Loss) టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇక కొందరైతే బరువు పెరిగామని తెలియగానే తినే ఫుడ్​ని తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వడం అటుంచితే.. సరైన పోషకాలు అందక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాకాకుండా మేము చెప్పే 90-30-50 డైట్ ప్లాన్ ఫాలో అయ్యారంటే.. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఈజీగా బరువు తగ్గుతారు. ఇంతకీ ఈ డైట్ ప్లాన్ ఏంటి? దీని వల్ల ఎలా బరువు తగ్గొచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతున్న 90-30-50 డైట్ ప్లాన్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. నిర్దేశించిన మోతాదులో ప్రొటీన్, హెల్తీ ఫ్ట్యాట్, ఫైబర్ వంటి పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. చాలా మంది బరువు తగ్గడానికి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో బలహీనంగా మారి పోషకాహార లోపంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఈ డైట్ ప్లాన్ ద్వారా అలాంటి సమస్య ఏం ఉండదు.

ఇక 90-30-50 డైట్ ప్లాన్ ప్రకారం.. ఒక వ్యక్తి రోజు తీసుకునే డైట్​లో 90 శాతం కార్బోహైడ్రేట్స్, 30 శాతం ప్రొటీన్స్, 50 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ డైట్​ను ఫాలో అవుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే గుడ్ రిజల్ట్స్ పొందవచ్చంటున్నారు.

90-30-50 డైట్ ప్లాన్ ద్వారా కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మాక్రోన్యూట్రియెంట్స్ సమతుల్యంగా తీసుకోవడం. ఎందుకంటే మన బాడీలో వివిధ విధుల నిర్వాహణలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ డైట్ ప్లాన్ ప్రకారం పోషకాలను తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తోంది. ఇక ఈ మాక్రోన్యూట్రియెంట్స్ బ్యాలెన్స్ ఆకలిని నియంత్రించడంలో, కోరికలను అరికట్టడంలో ప్రత్యామ్నాయ ఆహార విధానాలతో పోల్చినప్పుడు.. బరువును సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా? బ్రేక్​ఫాస్ట్​లో ఈ కాంబినేషన్స్​ ట్రై చేయండి!

సులభంగా బరువు తగ్గుతారు : సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అధిక కొవ్వు పదార్థాలను ఆహారంలో తగ్గిస్తారు. అయితే శరీరానికి అవసరమైన శక్తి, కణాల పనితీరుకు హెల్తీ ఫ్యాట్స్ చాలా అవసరం. అలాగే మెదడు వంటి అవయవాలను రక్షించడంలో, వివిధ రకాల హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఎంతో సహాయపడతాయి. అందుకే ఈ 90-30-50 డైట్ ప్లాన్ హెల్తీ ఫ్యాట్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. నట్స్, అవకాడోలు, ఆలివ్ నూనె వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది వెయిట్ తగ్గాలనుకునే వారికి చాలా బాగా పనిచేస్తుంది. శరీరానికి ఇతర డైట్​లతో పోల్చితే పోషకాలు సమతుల్యంగా అందుతాయి. ఫలితంగా ఎక్కువ తినాలనే కోరిక కంట్రోల్ ఉండి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇక చివరగా ఈ డైట్ ప్లాన్‌తో త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉన్నా కొందరికి మాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మెటబాలిజమ్ రేటు బలహీనంగా ఉన్న వ్యక్తులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు ఈ 90-30-50 డైట్‌ ప్లాన్‌ను నేరుగా ఫాలో అవ్వకూడదు. ఒకవేళ ఈ ప్లాన్​ను ఫాలో అవ్వాలనుకుంటే ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాతే అనుసరించడం మంచిది అంటున్నారు నిపుణులు.

సడన్​గా బరువు పెరిగారా? - మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే! చెక్​ చేసుకోండి!

యవ్వనంలో స్లిమ్​గా ఉండి - ఆ తర్వాత బరువు పెరిగారా? అసలైన కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.