ETV Bharat / state

'యాడా ఈవో అవినీతికి పాల్పడుతున్నారు'

author img

By

Published : Nov 24, 2019, 11:35 AM IST

'యాడా ఈవో అవినీతికి పాల్పడుతున్నారు'

స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత విషయంలో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ప్రొటోకాల్​ పాటించడం లేదని తెరాస నాయకులు ఆరోపించారు. యాదగిరిగుట్ట పర్యటనకు వచ్చిన సీఎస్​ జోషి, కలెక్టర్​ అనితారామచంద్రన్​కు నాయకులు వినతి పత్రం అందజేశారు.

'యాడా ఈవో అవినీతికి పాల్పడుతున్నారు'

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తెరాస నేతలు సీఎస్​ జోషికి వినతి పత్రం అందజేశారు. ఈవో గీతారెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత విషయంలో ప్రొటోకాల్​ పాటించడం లేదని వారు ఆరోపించారు.

రాష్ట్ర సర్కార్ వేలకోట్లు ఖర్చు పెట్టి యాదాద్రిని పునర్నిర్మిస్తుంటే.. ఈవో గీతారెడ్డి... ఆలయ అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించడం లేదని తెరాస నేతలు ఆరోపించారు. పలు ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆలయ అభివృద్ధి పనులను తన బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈవో గీతారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. ఆమెపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ అనితారామచంద్రన్​, సీఎస్​ జోషిలను కోరారు.

Intro:Tg_nlg_187_23_trs_vinathi_pathram_av_TS10134


యాదాద్రి భువనగిరి..

సెంటర్..యాదగిరిగుట్ట.

రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్...
వాయిస్:స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి.సునిత విషయంలో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ యాదగిరిగుట్ట పర్యటనకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషికి వినతి పత్రం అందజేశారు యాదగిరిగుట్ట స్థానిక టిఆర్ఎస్ నాయకులు..స్థానిక ఎమ్మెల్యే సునిత విషయంలో ప్రోటోకాల్ పాటించని ఆలయ ఈవో గీతారెడ్డి పై చర్యలు తీసుకోవాలని వినతి చేశారు....ఆలయ ఈవో ఎమ్మెల్యే కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదన్నారు స్థానిక టిఆర్ఎస్ నాయకులు...ప్రభుత్వం వేలకోట్ల ఖర్చుపెట్టి యాదాద్రి అభివృద్ధి చేస్తుంటే ఆలయ అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపించారు...పలు యాదాద్రి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సైతం స్థానిక ఎమ్మెల్యే ను ఆహ్వానం అందించలేదన్నారు...కొన్ని అభివృద్ధి పనుల్లో తన బినామీ కాంట్రాక్టర్లను పెట్టి ఆలయ ఈవో గీతారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు...

బైట్:1.రవీందర్(స్థానిక టిఆర్ఎస్ నాయకుడు)
2.మిట్ట వెంకటయ్య(స్థానిక టిఆర్ఎస్ నాయకుడు)
Body:Tg_nlg_187_23_trs_vinathi_pathram_av_TS10134Conclusion:Tg_nlg_187_23_trs_vinathi_pathram_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.