ETV Bharat / state

గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్​

author img

By

Published : Oct 2, 2020, 3:44 PM IST

రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాలు అభివృద్ధి కావాలనేది సీఎం ఆకాంక్ష అని మంత్రి కేటీఆర్​ అన్నారు. గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వివిధ క్యాటగిరీల్లో పోటీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి పురస్కారాలు అందిస్తామని పేర్కొన్నారు. భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్నారు.

minister ktr said Gandhi Jayanti should be observed as a day of purity
గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్​

గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి: కేటీఆర్​

రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా తీసుకొచ్చిన కొత్త పురపాలక చట్టంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు ఆయన వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పట్టణంలోని అతిథి గృహం ఆవరణలో రూ.8.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణం, నిరాశ్రయుల వసతిగృహం, భువనగిరి బైపాస్ వద్ద రూ.1.61 కోట్ల వ్యయంతో స్మృతి వనం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఉన్న ఐబీ(నీటి పారుదల శాఖ కార్యాలయం )ఆవరణలో రూ.11.50 లక్షలతో వీధి విక్రయదారుల కోసం నిర్మించిన 25 షాపులు, పట్టణ శివారులోని రిసోర్స్ పార్క్ లో మానవ వ్యర్ధాల శుద్దికరణ కేంద్రాన్ని కేటీఆర్​ ప్రారంభించారు. ప్రారంభిస్తున్నప్పుడు ఎల్​ఆర్​ఎస్​ని రద్దు చేయాలని నిరసిస్తూ.. భాజపా, సీపీఎం పార్టీ నాయకులు ఫ్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కి తరలించారు.

పట్టణ ప్రగతి టాయిలెట్ మానిటరింగ్ యాప్​, మున్సిపాలిటీల అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడానికి త్రైమాసిక వార్తా పత్రికను మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా పట్టణాల్లో శాశ్వతంగా డంప్ లేకుండా చేస్తామన్నారు. పట్టణ ప్రగతి పురస్కారాలు 5 కేటగిరీల్లో అందిస్తామని వెల్లడించారు. భువనగిరి మున్సిపాలిటీకి 5 కోట్ల నిధులు ప్రతీ నెలా అందుతున్నాయని, పారిశుద్ధ్య కార్మికులకు ప్రతీ నెలా వేతనాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పి ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

"భువనగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. అన్ని పురపాలక సంఘాలు అభివృద్ధి కావాలనేది సీఎం ఆకాంక్ష. గాంధీ జయంతిని స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలి. రాష్ట్రంలో 43 శాతం ప్రజలు పట్టణాల్లో ఉంటున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. అన్ని పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతి వెయ్యిమందికి ఒక శౌచాలయం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త పురపాలక చట్టంలో పచ్చదనం పెంచేందుకు ప్రాధాన్యం. 142 పురపాలకసంఘాల్లో 1,326 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా 197 డ్రై రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేశాం. డంప్ యార్డులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. బయో మైనింగ్‌ ప్రక్రియ ద్వారా చెత్తను శుద్ధి చేస్తున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా వివిధ క్యాటగిరీల్లో పోటీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి పురస్కారాలు అందిస్తాం. భువనగిరిలో రహదారుల విస్తరణ చేపట్టాలి. యాదాద్రి ఆలయం ప్రారంభమైతే ఈ ప్రాంత రూపురేఖలే మారుతాయి. తెలంగాణ పురపాలక సంఘాలు దేశానికే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్రంలోని పురపాలక సంఘాలన్నీ ఓడీఎఫ్‌ ప్లస్ ప్లస్‌కు చేరాలి. తెలంగాణ సిరి పేరుతో ఎరువులు తయారుచేసి ఆగ్రోస్‌కు అందిస్తాం. భువనగిరిలో ప్రతి రహదారిపై కాలిబాట తప్పనిసరిగా ఉండాలి."

- మంత్రి కేటీఆర్

ఇదీ చూడండి : భువనగిరిలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.